Chennai: 75 శాతం గృహాల నీటిలో ఈ.కొలి బ్యాక్టీరియా
ABN , Publish Date - Oct 25 , 2024 | 12:17 PM
రాజధాని నగరం చెన్నైలో ఉన్న 75 శాతం గృహాల్లో వినియోగించే నీటిలో ఈ.కొలి బ్యాక్టీరియా(E. coli bacteria) ఉన్నట్లు ఐఐటీ మద్రాసు(IIT Madras) జరిపిన పరిశోధనల్లో వెల్లడైంది. మద్రాసు ఐఐటీ ప్రొఫెసర్లు, విద్యార్థులు సంయుక్తంగా ‘పీపుల్స్ వాటర్ డేటా ఇనిషివేటివ్’ కార్యక్రమంలో భాగంగా నగరంలోని 752 గృహాల నుంచి తాగునీటి నమూనాలు సేకరించారు.
- నగరంలోనే అధికం
- ఐఐటీ మద్రాసు పరిశోధనలో వెల్లడి
చెన్నై: రాజధాని నగరం చెన్నైలో ఉన్న 75 శాతం గృహాల్లో వినియోగించే నీటిలో ఈ.కొలి బ్యాక్టీరియా(E. coli bacteria) ఉన్నట్లు ఐఐటీ మద్రాసు(IIT Madras) జరిపిన పరిశోధనల్లో వెల్లడైంది. మద్రాసు ఐఐటీ ప్రొఫెసర్లు, విద్యార్థులు సంయుక్తంగా ‘పీపుల్స్ వాటర్ డేటా ఇనిషివేటివ్’ కార్యక్రమంలో భాగంగా నగరంలోని 752 గృహాల నుంచి తాగునీటి నమూనాలు సేకరించారు. గృహాల్లోని కొళాయిలు, బావులు సహా ఇతర నీటి వనరుల నుంచి నీరు సేకరించి ల్యాబ్‌కు పంపారు. ఆ పరిశోధనల్లో తాగునీటిలో ‘ఈ.కొలి’ బ్యాక్టీరియా కాలుష్యం కలిసినట్లు వెల్లడైంది.
ఈ వార్తను కూడా చదవండి: Metro Rail: రేపు డ్రైవర్ రహిత మెట్రో రైల్ ట్రయల్ రన్
ఈ బాక్టీరియా ప్రభావంతో విరోచనాలు, వాంతులు వంటివాటితో తరచుగా అనారోగ్యానికి గురవుతారని తెలుస్తోంది. నీటి పైపులు, ట్యాంకులు, కంటైనర్లలో ఈ బ్యాక్టీరియా ఉంటుందని తెలిపారు. కొళాయిలు, బోరు బావులు, ఇతర వనరుల నుంచి నేరుగా వచ్చే నీటి నుంచి మాత్రమే ఈ బ్యాక్టీరియా కలుషితం అనుకోవడం పొరపాటని పరిశోధక బృందం సభ్యులు తెలిపారు. నీటిని శుభ్రంగా ఉంచుకొనే కొన్ని గృహాల్లోనూ ఈ బాక్టీరియా కనిపిం చడం దిగ్ర్భాంతి కలిగించిందని వారు వ్యాఖ్యానించారు.
ఈ విషయమై ఐఐటీ మద్రాసులోని వాటర్ ప్రోగ్రామ్ కోర్స్ కో-ఆర్టినేటర్ ప్రదీప్ మాట్లాడుతూ... బ్యాక్టీరియాతో కలుషితమైన ఇళ్లలో 75 శాతం మంది పిల్లలు నివసిస్తున్నారని, వారు కూడా బ్యాక్టీరియా కు గురయ్యే అవకాశముందని అధ్యయనంలో వెల్లడైందని తెలిపారు. ఇలా బ్యాక్టీరియా కలుషితం కాకుండా ఉండాలంటే వాటర్ ప్యూరిఫైయర్ తయారీదారులు ఇచ్చే సూచనలు పాటించాలని, కాచి చల్లార్చిన నీటిని తాగడం శ్రేయస్కరమని ఆయన తెలిపారు.
ఈ.కొలి అంటే ఏమిటి...?
ఈ.కొలి అంటే ‘ఎచేరిచియా కొలి (Escherichia.coil)’ అని సారాంశం. ఇది మనుషులు, జంతువుల ఉదర పేగుల్లో సాధారణంగా కనిపించే బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా ఎలాంటి హాని చేయకపోగా ఆహారం జీర్ణం అయ్యేందుకు దోహదం చేస్తుం ది. అలాగే, హాని కలిగించే క్రిములను ఈ బాక్టీరియా నాశనం చేస్తుంది. శరీరానికి కావాలసిన విటమిన్లను కూడా ఈ బ్యాక్టీరియా ఉత్పత్తి చేస్తుందని వైద్యులు పేర్కొన్నారు. విరోచనాలు, మూత్రాశయ మార్గంలో క్రిములు, సిఫిలిస్, నుమోనియా వంటి వ్యాధులు ఏర్పడవచ్చని తెలిపారు. ఉడికించని గొడ్డు మాంసం తింటే, వేడి చేయని పాలు, శీతల పానీయాలు, అపరిశుభ్రమైన నీరు, నిల్వ ఉంచిన ఉల్లిపాయల ద్వారా ఇవి వ్యాపిస్తాయి.
ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: ఉద్యోగులకు రెండు డీఏలు!
ఈవార్తను కూడా చదవండి: KTR: ఒకటి, రెండేళ్లు జైలుకు వెళ్లడానికైనా సిద్ధమే
ఈవార్తను కూడా చదవండి: రాష్ట్రంలోనే సొంతంగా సీడ్ గార్డెన్: తుమ్మల
ఈవార్తను కూడా చదవండి: నేడు సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్
Read Latest Telangana News and National News