Chennai: జాకీల సాయంతో లేపిన అమ్మవారి ఆలయం..
ABN , Publish Date - Nov 07 , 2024 | 01:35 PM
తమిళనాడు రాష్ట్రంలోని తిరేవేంగిడపురం గ్రామంలో కృష్ణన్ మారియమ్మన్ ఆలయం(Krishnan Mariamman Temple) ఉంది. ఈ ఆలయంలో వినాయకుడు, ఆంజనేయుడు, దుర్గ, షణ్ముగ, కౌమారి, వైష్ణవి, మహేశ్వరి తదితర దేవతామూర్తులకు ప్రత్యేక సన్నిధులు నిర్మించారు.
చెన్నై: పొన్నేరి సమీపం తిరేవేంగిడపురం గ్రామంలో కృష్ణన్ మారియమ్మన్ ఆలయం(Krishnan Mariamman Temple) ఉంది. ఈ ఆలయంలో వినాయకుడు, ఆంజనేయుడు, దుర్గ, షణ్ముగ, కౌమారి, వైష్ణవి, మహేశ్వరి తదితర దేవతామూర్తులకు ప్రత్యేక సన్నిధులు నిర్మించారు. ఈ ఆలయంలో ప్రతి శుక్రవారం జరిగే పూజలకు భక్తులు పెద్దసంఖ్యలో వస్తుంటారు. ఆలయం సమీపంలోని రోడ్డును పునరుద్ధరించే ప్రతిసారి రోడ్డు ఎత్తు పెరుగుతోంది. దీంతో, ఆలయం రోడ్డు కంటే కిందకు వెళ్లింది.
ఈ వార్తను కూడా చదవండి: Chennai: నటి కస్తూరి అరెస్టుకు రంగం సిద్ధం..
ప్రస్తుతం పొన్నేరి(Ponneri) పరిసర ప్రాంతాల్లో జాకీలతో సాయంతో ‘లిఫ్టింగ్’ విధానంలో భవనాల ఎత్తు పెంచే పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో, ఈ లిఫ్టింగ్ విధానంలో ఆలయం ఎత్తు పెంచాలని నిర్వాహకులు నిర్ణయించారు. ఓ సంస్థ సాయం తో జాకీలు ఏర్పాటుచేసి క్రమక్రమంగా లిఫ్టింట్ చేశారు. 20 రోజుల లిఫ్టింగ్‌లో ఆలయం మూడడుగుల ఎత్తు లేపారు. మరో రెండు నెలలో ఆలయంలో జీర్ణోద్ధరణ చేపట్టి కుంభాభిషేకం నిర్వహిస్తామని ఆలయ నిర్వాహకులు ఆర్‌ఎన్ బాలాజి సర్కార్ తెలిపారు.
....................................................................
ఈ వార్తను కూడా చదవండి:
.....................................................................
Trains: చెన్నై-నెల్లూరు మెము రైళ్ల రద్దు.. కారణం ఏంటంటే..
చెన్నై: చెన్నై సెంట్రల్-గూడూరు సెక్షన్(Chennai Central-Gudur Section)లోని తడ-సూళ్లూరుపేట మధ్య రైలుమార్గంలో మరమ్మతుల కారణంగా మూర్‌మార్కెట్ కాంప్లెక్-సూళ్లూరుపేట-నెల్లూరు మార్గంలో పలు మెము, సబర్బన్ రైళ్లు రద్దు చేసినట్లు దక్షిణ రైల్వే(Southern Railway) ఒక ప్రకటనలో తెలిపింది.
- నెం.06741 మూర్ మార్కెట్ నుంచి ఉదయం 5.15 గంటలకు సూళ్లూరుపేటకు బయల్దేరే సబర్బన్ రైలు, నెం.66004 ఆవడి నుంచి ఉదయం 6.40 గంటలకు మూర్‌మార్కెట్ కాంప్లెక్స్‌కు బయల్దేరే సబర్బన్ రైలు, నెం.06745 సూళ్లూరుపేట నుంచి ఉదయం 7.55 గంటలకు నెల్లూరుకు బయల్దేరే మెము, నెం.06746 నెల్లూరు నుంచి ఉదయం 10.20 గంటలకు సూళ్లూరుపేట(Sullurpet)కు బయల్దేరే మెము, 06742 సూళ్లూరుపేట నుంచి మధ్యాహ్నం 12.35 గంటలకు మూర్‌మార్కెట్ కాంప్లెక్స్ బయల్దేరే మెము రైళ్లు ఈ నెల 7,9,12 తేదీల్లో రద్దు.
పాక్షిక రద్దు...
- మూర్‌మార్కెట్ కాంప్లెక్స్ నుంచి ఉదయం 4.15, 5 గంటలకు సూళ్లూరుపేటకు వెళ్లే రైళ్లు ఈ నెల 7,9,12 తేదీల్లో సూళ్లూరుపేటకు బదులు ఎలావూర్ వరకు మాత్రమే నడువనున్నాయి. మరుమార్గంలో సూళ్లూరుపేట నుంచి మూర్ మార్కెట్ కాంప్లెక్స్‌కు ఉదయం 6.45, సూళ్లూర్‌పేట నుంచి ఉదయం 7.25 గంటలకు చెన్నై బీచ్‌కు బయల్దేరే సబర్బన్ రైళ్లు ఈ నెల 7,9,12 తేదీల్లో సూళ్లూరుపేటకు బదులుగా ఎలావూర్ నుంచి బయల్దేరనున్నాయి.
ఈవార్తను కూడా చదవండి: యాదగిరిగుట్ట ఆలయంలో కుంగిన ఫ్లోరింగ్!
ఈవార్తను కూడా చదవండి: కేశవాపురం వద్దు.. మేఘా కాంట్రాక్టు రద్దు
ఈవార్తను కూడా చదవండి: అరుణాచల ప్రదక్షిణకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
ఈవార్తను కూడా చదవండి: తీన్మార్ మల్లన్నకు స్ట్రాంగ్ వార్నింగ్
Read Latest Telangana News and National News