Share News

Chennai: నీలగిరుల్లో అడవి ఏనుగుల సంచారం..

ABN , Publish Date - Sep 18 , 2024 | 11:50 AM

నీలగిరి(Neelagiri) జిల్లాలో గత కొద్ది రోజులుగా వన్యమృగాలు అడవుల నుండి వచ్చి జనావాస ప్రాంతాల్లో సంచరిస్తున్నాయి. నీరు, ఆహారం కోసం ఆ జంతువులు కొండదిగువనున్న నివాసాల్లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఊటీ(Ooty) నుంచి మంజూరు మీదుగా కోవై వెళ్లే రహదారిలో ఓ పెద్ద ఎలుగుబంటిని చూసి వాహన చోధకులు భీతిల్లారు.

Chennai: నీలగిరుల్లో అడవి ఏనుగుల సంచారం..

- భీతిల్లుతున్న వాహన ఛోదకులు

చెన్నై: నీలగిరి(Neelagiri) జిల్లాలో గత కొద్ది రోజులుగా వన్యమృగాలు అడవుల నుండి వచ్చి జనావాస ప్రాంతాల్లో సంచరిస్తున్నాయి. నీరు, ఆహారం కోసం ఆ జంతువులు కొండదిగువనున్న నివాసాల్లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఊటీ(Ooty) నుంచి మంజూరు మీదుగా కోవై వెళ్లే రహదారిలో ఓ పెద్ద ఎలుగుబంటిని చూసి వాహన చోధకులు భీతిల్లారు. ఈ నేపథ్యంలో మంజూరు నుంచి కోయంబత్తూరు వెళ్లే రహదారిలో అడవి ఏనుగులు గుంపుగా రోడ్డులో సంచరించటంతో వాహన చోదకులు దిగ్ర్భాంతి చెందారు.

ఈ వార్తను కూడా చదవండి: Viral Video: ఒక్క రూపాయితో ఉద్యోగాన్ని ఊడగొట్టుకున్న ఉద్యోగి


nani1.jpg

ఆ రహదారి చాలా ఇరుకుగా ఉండటంతో వాహన చోదకులు హారన్‌ కొట్టినా అవి కదలడం లేదు. సుమారు రెండు గంటలపాటు ఆ ఏనుగులు రోడ్డుపై సంచరిస్తూ వాహనాల రాకపోకలకు అడ్డుగా నిలిచాయి. ఆ తర్వాత అడవిలోకి వెళ్లటంలో వాహనాలు కదిలాయి. నీలగిరి రహదారుల్లో ప్రస్తుతం ఏనుగుల సంచారం అధికంగా ఉందని వాహన చోదకులు అప్రమత్తంగా ఉండాలని హైవే అధికారులు హెచ్చరిస్తున్నారు.


............................................................

ఈ వార్తను కూడా చదవండి:

............................................................

Chennai: క్రికెట్‌ ఆడుతూ యువకుడి మృతి

nani2.jpg

చెన్నై: క్రికెట్‌(Cricket) ఆడుతున్న యువకుడు హఠాత్తుగా స్పృహతప్పి మృతిచెందిన ఘటన చెంగల్పట్టు జిల్లాలో చోటుచేసుకుంది. ఉత్తరమేరూర్‌ సమీపం కన్నకొళత్తూర్‌ ప్రాంతానికి చెందిన బాలాజీ (32) రెండు రోజుల క్రితం మామ ఊరైన నొలంబూర్‌(Nolambur) వచ్చాడు. నొలంబూర్‌, కీల్‌సేవూరు గ్రామాల యువకుల మధ్య క్రికెట్‌ మ్యాచ్‌ గత ఆదివారం జరిగింది. క్రికెట్‌ అంటే ఆసక్తి ఉన్న బాలాజి నొలంబూర్‌ టీమ్‌లో ఆడాడు. బౌలింగ్‌ వేసేందుకు వెళ్తున్న బాలాజి హఠాత్తుగా స్పృహ తప్పి కింద పడిపోయాడు. సహచరులు వెంటనే అతడిని సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స అనంతరం దిండువనం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కానీ, మార్గమధ్యంలో అతడు మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.


ఇదికూడా చదవండి: తుపాకీరాముడిని మరిపిస్తున్న కౌశిక్‌రెడ్డి: మల్లు రవి

ఇదికూడా చదవండి: ప్రతి నియోజకవర్గానికీ ఎంఎస్ఎంఈ పార్కు

ఇదికూడా చదవండి: రాసిపెట్టుకో.. రాజీవ్‌ విగ్రహం తొలగిస్తాం

Read LatestTelangana News andNational News

Updated Date - Sep 18 , 2024 | 11:53 AM