Share News

Chennai: సముద్రంలో పడవను ఢీకొన్న నౌక

ABN , Publish Date - Dec 12 , 2024 | 12:13 PM

కన్నియాకుమారి(Kanyakumari) జిల్లా కుళచ్చల్‌ నడి సముద్రంలో సరుకు నౌక ఢీకొనడంతో దెబ్బతిన్న పడవ నీటమునిగిన నేపథ్యంలో, పడవలో 9 మంది జాలర్లను సహచర జాలర్లు రక్షించారు. కుళచ్చల్‌ ఫిషింగ్‌ హార్బర్‌ నుంచి ఐదు రోజుల క్రితం ఫైబర్‌ పడవ(Fiber boat)లో 9 మంది జాలర్లు చేపల వేటకు వెళ్లారు.

Chennai: సముద్రంలో పడవను ఢీకొన్న నౌక

- 9 మంది జాలర్లు సురక్షితం

చెన్నై: కన్నియాకుమారి(Kanyakumari) జిల్లా కుళచ్చల్‌ నడి సముద్రంలో సరుకు నౌక ఢీకొనడంతో దెబ్బతిన్న పడవ నీటమునిగిన నేపథ్యంలో, పడవలో 9 మంది జాలర్లను సహచర జాలర్లు రక్షించారు. కుళచ్చల్‌ ఫిషింగ్‌ హార్బర్‌ నుంచి ఐదు రోజుల క్రితం ఫైబర్‌ పడవ(Fiber boat)లో 9 మంది జాలర్లు చేపల వేటకు వెళ్లారు.

ఈ వార్తను కూడా చదవండి: Minister: ఆ కొండపైకి భక్తులకు అనుమతి లేదు..


nani4.2.jpg

కుళచ్చల్‌ నుంచి 20 నాటికల్‌ మైళ్ల దూరంలో వారు చేపలు పడుతుండగా చమురు లోడుతో ఉన్న నౌక పడవను ఢీకొంది. దెబ్బతిన్న పడవ క్రమక్రమంగా నీళ్లలో మునగడం ప్రారంభమైంది. వీరిని గమనించిన సహచర జాలర్లు ఆ ప్రాంతానికి చేరుకొని, 9 మందిని సురక్షితంగా తమ పడవుల్లోకి చేర్చారు. కాగా, పడవ నీటమునుగుతున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరలయ్యింది.


ఈవార్తను కూడా చదవండి: Special Trains: శబరిమలకు 26 ప్రత్యేక రైళ్లు: ద.మ. రైల్వే

ఈవార్తను కూడా చదవండి: హాస్టల్‌ ఫుడ్‌ పాయిజన్‌ ఘటనల్లో.. ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌పై అనుమానాలు

ఈవార్తను కూడా చదవండి: విద్యార్థుల సమస్యలు పట్టవా రేవంత్‌: కవిత

ఈవార్తను కూడా చదవండి: ఉత్తమ పార్లమెంటేరియన్‌ తరహాలో ఏటా ఉత్తమ లెజిస్లేచర్‌ అవార్డు

Read Latest Telangana News and National News

Updated Date - Dec 12 , 2024 | 12:13 PM