Chennai: చెన్నైలో తెలుగు భవనం
ABN , Publish Date - Nov 16 , 2024 | 11:18 AM
చెన్నైలో ‘తెలుగు భవనం’ నిర్మాణం చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan)కు తమిళనాడు తెలుగు పీపుల్ ఫౌండేషన్ విజ్ఞప్తి చేసింది. మంగళగిరిలో పవన్ కల్యాణ్‌తో భేటీ అయిన ఫౌండేషన్ వ్యవస్థాపకులు దేవరకొండ రాజు నేతృత్వంలోని ప్రతినిధుల బృందం.. తమిళనాడులోని తెలుగువారి స్థితిగతులను వివరించింది.
- పవన్ కల్యాణ్‌కు ‘తెలుగు పీపుల్ ఫౌండేషన్’ వినతి
చెన్నై: చెన్నైలో ‘తెలుగు భవనం’ నిర్మాణం చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan)కు తమిళనాడు తెలుగు పీపుల్ ఫౌండేషన్ విజ్ఞప్తి చేసింది. మంగళగిరిలో పవన్ కల్యాణ్‌తో భేటీ అయిన ఫౌండేషన్ వ్యవస్థాపకులు దేవరకొండ రాజు నేతృత్వంలోని ప్రతినిధుల బృందం.. తమిళనాడులోని తెలుగువారి స్థితిగతులను వివరించింది. చెన్నై, కోయంబత్తూరు, కాంచీపురం, మదురై, చెంగల్పట్టు, తిరువళ్లూరు, తిరుత్తణి, కృష్ణగిరి(Chengalpattu, Tiruvallur, Tiruttani, Krishnagiri) ప్రాంతాల్లో తెలుగువారు అధికంగా వున్నారని, వివిధ రంగాల్లో వారు స్థిరపడ్డారని వివరించింది.
ఈ వార్తను కూడా చదవండి: Rains: బలపడుతున్న ఈశాన్య రుతుపవనాలు.. 21 జిల్లాలకు అలెర్ట్
జయలలిత ముఖ్యమంత్రిగా వున్న సమయంలో చెన్నైలో తెలుగు భవనం నిర్మాణానికి అంగీకరించారని, అయితే కాలక్రమంలో ఆ ప్రాజెక్టు ముందుకు కదల్లేదని వారు వెల్లడించారు. ఇప్పుడైనా ఆంధప్రదేశ్ ప్రభుత్వం చెన్నైలో తెలుగు భవన నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఫౌండేషన్ తరఫున చేస్తున్న సామాజిక సేవలను, తెలుగు భాష, సంస్కృతుల కోసం చేస్తున్న కృషిని ప్రతినిధుల బృందం వివరించగా, ఉపముఖ్యమంత్రి అభినందించారు. ఈ భేటీలో దేవరకొండ రాజుతో పాటు ప్రొఫెసర్ కె.శ్రీనివాసరావు, ఏఎం.మనోజ్, ప్రియా శ్రీధర్, బి.రఘునాథ్ తదితరులున్నారు.
ఈవార్తను కూడా చదవండి: రేవంత్ ఓ రాబందు..
ఈవార్తను కూడా చదవండి: అయ్యప్ప భక్తుల కోసం మరో 4 ప్రత్యేక రైళ్లు
ఈవార్తను కూడా చదవండి: తగ్గిన ధరలకు బ్రేక్.. మళ్లీ పెరిగిన పుత్తడి రేట్లు
ఈవార్తను కూడా చదవండి: Treatment: మా అమ్మాయికి చికిత్స చేయించండి
Read Latest Telangana News and National News