Share News

Chennai: నిప్పుల కొలిమిలా చెన్నై నగరం.. తీవ్రమైన సెగతో అల్లాడిన జనం

ABN , Publish Date - May 30 , 2024 | 12:26 PM

అగ్ని నక్షత్రం రెండురోజులక్రితమే ముగిసినా చెన్నై(Chennai) నగరం బుధవారం నిప్పుల కొలిమిలా కాగిపోయింది. విపరీతమైన సెగతో నగర ప్రజలు అల్లాడిపోయారు. బుధవారం ఉదయం పది గంటల నుండి వడగాడ్పులకు నగరవాసులు చెమటతో తడిసిపోయారు.

Chennai: నిప్పుల కొలిమిలా చెన్నై నగరం.. తీవ్రమైన సెగతో అల్లాడిన జనం

చెన్నై: అగ్ని నక్షత్రం రెండురోజులక్రితమే ముగిసినా చెన్నై(Chennai) నగరం బుధవారం నిప్పుల కొలిమిలా కాగిపోయింది. విపరీతమైన సెగతో నగర ప్రజలు అల్లాడిపోయారు. బుధవారం ఉదయం పది గంటల నుండి వడగాడ్పులకు నగరవాసులు చెమటతో తడిసిపోయారు. ఎండవేడిని తట్టుకోలేక నిలువనీడలేక అవస్థలపాలయ్యారు. అగ్ని నక్షత్రం కంటే అధికంగా ఎండలు మండడం చూసి నగరవాసులు దిగ్ర్భాంతి చెందారు. నగరంలో గత రెండు రోజులుగా పగటిపూట ఉష్ణోగ్రతలు పెరిగాయి. మంగళవారం నగరంలో 41.1డిగ్రీల (106 డిగ్రీల ఫారెన్‌హీట్‌) ఉష్ణోగ్రతలు నమోదైంది. ఇదే విధంగా బుధవారం కూడా 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగి నగరమంతటా వడగాడ్పులు వీచాయి. ఇక పాదచారులు, ద్విచక్రవాహన చోధకులు ఎండవేడి భరించలేక ఇబ్బందులు పడ్డారు.

ఇదికూడా చదవండి: PM Modi: నిఘా నీడలో కన్నియాకుమారి..


సిటీ బస్సుల్లో ప్రయాణించినవారు కూడా వేడి గాలులకు చెమటతో తడిసి ముద్దయ్యారు. భవన నిర్మాణ కార్మికులు కూడా ఎండవేడిని భరించలేక ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పనులు ఆపేశారు. ఇక పెంకుటిళ్లలో నివసిస్తున్నవారి పరిస్థితి కూడా దయనీయంగా మారింది. నగరంలోని రాయపురం, ఎన్నూరు, అంబత్తూరు, ఆవడి, తాంబరం, క్రోంపేట, వేళచ్చేరి, గిండి తదితర ప్రాంతాల్లోనూ ఎండ వేడి అధికంగా ఉండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎండవేడిమి నుండి ఉపశమనం పొందటానికి నగరవాసులు శీతలపానీయాల దుకాణాల వద్ద బారులు తీరారు. కొబ్బరి బోండాలు, తాటి ముంజలు అమ్ముతున్న ప్రాంతాల్లో గుమికూడారు. టి.నగర్‌, తేనాంపేట, అన్నాసాలై, సైదాపేట, అడయార్‌ తదితర ప్రాంతాల్లో ద్విచక్రవాహనాల్లో ప్రయాణించేవారు వడగాడ్పులకు ఇబ్బంది పడ్డారు. ఉదయం పది నుంచి సాయంత్రం నాలుగు గంటల దాకా నగరమంతా సెగతో నగరవాసులంతా అల్లాడిపోయారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

ఇదికూడా చదవండి: Hyderabad: పోలింగ్‌ రోజున.. తగ్గిన పొల్యూషన్‌

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - May 30 , 2024 | 12:26 PM