Share News

Chennai: కన్నియాకుమారిలో వెనక్కి వెళ్లిన సముద్రం..

ABN , Publish Date - Jul 09 , 2024 | 12:23 PM

రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఒకటైన కన్నియాకుమారి(Kanniyakumari) సముద్ర తీరంలో నీరు ఉన్నట్టుండి వెనక్కి వెళ్ళింది. దీంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. మంగళవారం ఉదయం కుమరి జిల్లాలోని వివేకానంద రాక్‌, తిరువళ్ళూరు విగ్రహాల వద్దకు వెళ్ళేందుకు పర్యాటకులు చేరుకున్నారు.

Chennai: కన్నియాకుమారిలో వెనక్కి వెళ్లిన సముద్రం..

- భయాందోళనలో స్థానికులు

- పర్యాటకుల అవస్థలు

చెన్నై: రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఒకటైన కన్నియాకుమారి(Kanniyakumari) సముద్ర తీరంలో నీరు ఉన్నట్టుండి వెనక్కి వెళ్ళింది. దీంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. మంగళవారం ఉదయం కుమరి జిల్లాలోని వివేకానంద రాక్‌, తిరువళ్ళూరు విగ్రహాల వద్దకు వెళ్ళేందుకు పర్యాటకులు చేరుకున్నారు. వీరంతా బోటుల్లో ప్రయాణం చేసేందుకు టిక్కెట్ల కొనుగోలు చేసి నిల్చొన్నారు. ఆ సమయంలో ఉన్నట్టుండి సముద్రం నీరు వెనక్కి వెళ్ళింది. దీంతో పడవ ప్రయాణాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. దాదాపు రెండు గంటల తర్వాత పడవ ప్రయాణాన్ని మళ్ళీ ప్రారంభించడంతో పర్యాటకులు ఊపిరి పీల్చుకున్నారు. ఆదివారం కూడా ఇదే పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే.

ఇదికూడా చదవండి: Rains: ఆరు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..


గత కొన్ని రోజులుగా పలు తీర ప్రాంతాల్లో సముద్రం నీరు ఒక్కసారిగా వెనక్కి వెళ్తున్న విషయం తెల్సిందే. ఇలా ఉన్నట్టుండి వెనక్కి వెళ్ళడం, కొన్ని గంటల తర్వాత మళ్ళీ పూర్వస్థితికి రావడం జరుగుతుంది. ఇలా జరగడానికి గల కారణాలు మాత్రం తెలియడం లేదు. మరికొన్ని సందర్భాల్లో సముద్రం అలలు నాలుగు నుంచి ఐదు అడుగుల వరకు ఎగిసిపడుతుంటాయి. అలాంటి సమయాల్లో కూడా పడవ ప్రయాణాన్ని పర్యాటక శాఖ అధికారులు నిలిపివేస్తున్నారు.


ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 09 , 2024 | 12:23 PM