Share News

Chennai: వెయ్యేళ్ల నాటి నంది విగ్రహం లభ్యం

ABN , Publish Date - Nov 23 , 2024 | 12:51 PM

ఆదికుంబేశ్వర్‌ ఆలయంలో వర్షం నీరు నిలిచి పోకుండా కాలువ తవ్వకాలు గురువారం ప్రారంభమయ్యాయి. కాలువ మూడడుగల లోతున తవ్విన సమయంలో, రెండున్నర అడుగుల ఎత్తు, పొడవుతో అద్బుత శిల్పకళ నైపుణ్యంతో కూడిన నంది విగ్రహం బయల్పడింది.

Chennai: వెయ్యేళ్ల నాటి నంది విగ్రహం లభ్యం

చెన్నై: తంజావూరు జిల్లా కుంభకోణం ఆదికుంబేశ్వర్‌ ఆలయంలో వర్షం నీరు నిలిచి పోకుండా కాలువ తవ్వకాలు గురువారం ప్రారంభమయ్యాయి. కాలువ మూడడుగల లోతున తవ్విన సమయంలో, రెండున్నర అడుగుల ఎత్తు, పొడవుతో అద్బుత శిల్పకళ నైపుణ్యంతో కూడిన నంది విగ్రహం బయల్పడింది. ఈ విషయమై ఆలయ నిర్వహణాధికారి కృష్ణన్‌కుమార్‌(Krishnan Kumar) మాట్లాడుతూ... చోళుల కాలం నాటి శిల్పాలతో ముదురు రంగు నల్లరాతితో నంది విగ్రహం ఉందన్నారు. ఈ విగ్రహం సుమారు వెయ్యేళ్ల ప్రాచీనమైనది కావచ్చని, ఈ విషయమై రెవెన్యూ, పురావస్తు శాఖ అధికారులు పరిశీలిస్తున్నారని, ఆ తర్వాత పూర్తి సమాచారం అందుతుందని ఆయన తెలిపారు.

ఈ వార్తను కూడా చదవండి: Chennai: రాష్ట్రంలో రాజకీయ వెలితి కొనసాగుతోంది.. ఈమాట అన్నది ఎవరో తెలిస్తే..


..............................................................

ఈ వార్తను కూడా చదవండి:

...............................................................

Khushboo: మోదీ, అమిత్‌షా వ్యూహరచనతో ఈసారి రాష్ట్రంలో పాలన మాదే

- బీజేపీ మహిళా నేత ఖుష్బూ

చెన్నై: రాష్ట్రంలో 2026లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీ(Narendra Modi), హోం మంత్రి అమిత్‌షా(Amit Shah) రూపొందించబోయే కొత్త వ్యూహరచనతో పాలనలో మార్పు తథ్యమని, బీజేపీ ఘనవిజయం సాధిస్తుందని బీజేపీ జాతీయ కార్యాచరణ కమిటీ సభ్యురాలు, నటి ఖుష్బూ పేర్కొన్నారు. దేశాన్ని, రాష్ట్రాన్ని ఏ పార్టీ పరిపాలిస్తే మంచి జరుగుతుందో ప్రజలు బాగా అర్థం చేసుకుంటున్నారని, దేశమంతటా ప్రధాని మోదీపై ప్రజాదరణ విపరీతంగా పెరుగుతోందని అన్నారు. మణిపూర్‌(Manipur) ఘటనలపై ప్రధాని మోదీపై కాంగ్రెస్‌ నేతలంతా దుమ్మెత్తి పోశారని, చివరకు ఆ రాష్ట్రం కాంగ్రెస్‌ చిత్తుగా ఒడిందన్నారు.


ఈవార్తను కూడా చదవండి: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు

ఈవార్తను కూడా చదవండి: Sarpanch: కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్‌ ఆత్మహత్య

ఈవార్తను కూడా చదవండి: AV Ranganath: కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తుంది!

ఈవార్తను కూడా చదవండి: వామ్మో...చలి

Read Latest Telangana News and National News

Updated Date - Nov 23 , 2024 | 12:51 PM