Share News

Chennai: రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి రాకెట్‌ లాంఛర్‌ లభ్యం

ABN , Publish Date - Nov 08 , 2024 | 11:49 AM

తిరుచ్చి జిల్లా అందనల్లూర్‌ వడతీర్ధనాథాలయం సమీపంలోని కావేరి ఘాట్‌(Kaveri Ghat)లో గత నెల 30వ తేది 60 మీ పొడవున్న రాకెట్‌ లాంఛర్‌ లభ్యమైంది. సమాచారం అందుకున్న ఆర్మీ అధికారులు అక్కడకు వెళ్లి కందకం తవ్వి రాకెట్‌ లాంఛర్‌(Rocket Launcher) పేల్చి నిర్వీర్యం చేశారు.

Chennai: రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి రాకెట్‌ లాంఛర్‌ లభ్యం

చెన్నై: తిరుచ్చి జిల్లా అందనల్లూర్‌ వడతీర్ధనాథాలయం సమీపంలోని కావేరి ఘాట్‌(Kaveri Ghat)లో గత నెల 30వ తేది 60 మీ పొడవున్న రాకెట్‌ లాంఛర్‌ లభ్యమైంది. సమాచారం అందుకున్న ఆర్మీ అధికారులు అక్కడకు వెళ్లి కందకం తవ్వి రాకెట్‌ లాంఛర్‌(Rocket Launcher) పేల్చి నిర్వీర్యం చేశారు.

ఈ విషయమై ఆర్మీ అధికారుల వివరాల మేరకు, ఈ లాంఛర్‌ 1953లో కొరియా యుద్ధంలో రాకెట్‌ లాంఛర్‌ వెపన్‌ ‘పసుకా’ ఉపయోగించిన షెల్స్‌ డమ్మీ అన్నారు. ఈ పసుకా రాకెట్‌ లాంఛర్‌(Rocket Launcher) ఆయుధాల ఫిరంగి, ట్యాంకులపై దాడి చేయడం, ధ్వంసం చేసేందుకు వినియోగిస్తారని తెలిపారు. రెండో ప్రపంచ యుద్ధంలో వినియోగించిన ఈ రాకెట్‌ లాంఛర్‌ ఇక్కడకు ఎలా వచ్చిందనే కోణంలో విచారణ చేపట్టినట్లు వారు పేర్కొన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Special trains: సికింద్రాబాద్‌-విల్లుపురం మధ్య ప్రత్యేక రైళ్లు


................................................................

ఈ వార్తను కూడా చదవండి:

...............................................................

Teacher: తరగతి గదిలో గుండెపోటుతో ఉపాధ్యాయుడి మృతి

చెన్నై: ఈరోడ్‌ జిల్లా ఆందియూర్‌ సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయుడు(Teacher) హఠాత్తుగా గుండెపోటుతో మృతిచెందిన ఘటన విషాదానికి దారితీసింది. బర్గూర్‌ కొండ ప్రాంతంలోని సుండాపూర్‌ పంచాయతి యూనియన్‌ మాధ్యమిక పాఠశాలలో సెకండరీ గ్రేడ్‌ టీచర్‌గా ఆంతోని జొరాల్డ్‌ (49) పనిచేస్తున్నారు. బుధవారం ఉదయం పాఠశాలకు వచ్చిన ఆయన తరగతులు ముగించుకొని మధ్యాహ్న భోజనం చేశారు. మధ్యాహ్నం పాఠాలు బోధించేందుకు తరగతి గదిలోకి వెళ్లిన ఆయన కుర్చీలో కూర్చుంటూ హఠాత్తుగా స్పృహ తప్పి పడిపోయారు.

nani3.jpg


దిగ్చ్రాంతి చెందిన విద్యార్థులు కేకలు వేయడంతో అక్కడకు చేరుకున్న సహచర ఉపాధ్యాయులు అతడిని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు 108 అంబులెన్స్‌కు ఫోన్‌ చేశారు. అక్కడకు చేరుకున్న అంబులెన్స్‌(Ambulance)లోని వైద్య సిబ్బంది, అతడిని పరిశీలించి గుండెపోటుతో మృతిచెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై బర్గూర్‌ పోలీసులు కేసు నమోదుచేశారు. కాగా, ఉపాధ్యాయుడు ఆంతోని జొరాల్డ్‌ మృతికి పాఠశాల విద్యాశాఖ మంత్రి అన్బిల్‌ మహేష్‌ దిగ్ర్భాంతి వ్యక్తం చేయడంతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.


ఈవార్తను కూడా చదవండి: పశ్చిమ బెంగాల్‌ నుంచి నగరానికి హెరాయిన్‌.. ఐటీ కారిడార్‌లో విక్రయం

ఈవార్తను కూడా చదవండి: నీళ్ల బకెట్లో పడి ఏడాదిన్నర చిన్నారి మృతి

ఈవార్తను కూడా చదవండి: కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలు దివాలా: కిషన్‌రెడ్డి

ఈవార్తను కూడా చదవండి: వద్దొద్దంటున్నా.. మళ్లీ ఆర్‌ఎంసీ!

Read Latest Telangana News and National News

Updated Date - Nov 08 , 2024 | 11:49 AM