Share News

Chennai: వామ్మో.. బాగానే పెరిగిందిగా.. మునక్కాయలు కిలో రూ.400

ABN , Publish Date - Dec 07 , 2024 | 10:42 AM

వెల్లుల్లికి పోటీగా మునక్కాయల ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. ‘ఫెంగల్‌’ తుఫాన్‌('Fengal' Cyclone) కారణంగా సాగు పనులు స్తంభించడంతో కోయంబేడు మార్కెట్‌కు కూరగాయల దిగుమతులు తగ్గాయి.

Chennai: వామ్మో.. బాగానే పెరిగిందిగా.. మునక్కాయలు కిలో రూ.400

చెన్నై: వెల్లుల్లికి పోటీగా మునక్కాయల ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. ‘ఫెంగల్‌’ తుఫాన్‌('Fengal' Cyclone) కారణంగా సాగు పనులు స్తంభించడంతో కోయంబేడు మార్కెట్‌కు కూరగాయల దిగుమతులు తగ్గాయి. ఈ మార్కెట్‌కు ప్రతిరోజు 7,000 నుంచి 8,000 టన్నుల కూరగాయలు దిగుమతవుతున్న తరుణంలో, బుధవారం 4,000 టన్నుల కూరగాయాలు మాత్రమే రావడంతో వాటి ధరలు పెరిగాయి.

ఈ వార్తను కూడా చదవండి: మూడు సార్లు భూకంపం.. బయటకు పరుగులు తీసిన


ముఖ్యంగా, ఈ మార్కెట్‌కు పెరంబలూరు, ఒట్టాన్‌సత్రం, తేని, తిరునల్వేలి, విరుదాచలం(Perambalur, Ottansatram, Theni, Tirunelveli, Virudachalam) తదితర ప్రాంతాల నుంచి మునక్కాయలు వస్తుంటాయి. ప్రస్తుతం సీజన్‌ ముగియడంతో మునక్కాయల దిగుమతులు తగ్గడంతో గుజరాత్‌, మహారాష్ట్ర(Gujarat, Maharashtra) తదితర రాష్ట్రాల నుంచి మునక్కాయలు దిగుమతి చేసుకుంటున్నారు.


nani1.2.jpg

సాధారణంగా 300 నుంచి 400 టన్నుల మునక్కాయల విక్రయాలు జరుగుతుండగా, బుధవారం 50 టన్నులు మాత్రమే మార్కెట్‌కు వచ్చాయి. దీంతో కిలో మునక్కాయలు రూ.350 నుంచి రూ.400 ధర పలికాయి. అదే సమయంలో కొద్ది నెలలుగా వెల్లుల్లి ధర కిలో రూ.450కి చేరుకున్న నేపథ్యంలో, మునక్కాయల ధరలు కూడా పెరగడంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు.


ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: డ్రగ్స్‌, సైబర్‌ నేరాల విచారణకు.. ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు

ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: గ్రామీణ మహిళకు నిలువెత్తు రూపం

ఈవార్తను కూడా చదవండి: Allu Arjun: రేవతి కుటుంబానికి రూ.25 లక్షలు

ఈవార్తను కూడా చదవండి: Kodangal: రెండు రోజుల కస్టడీకి పట్నం నరేందర్‌ రెడ్డి

Read Latest Telangana News and National News

Updated Date - Dec 07 , 2024 | 10:42 AM