Chief Minister: టికెట్ ఇవ్వకుండా దారుణంగా అవమానిస్తే.. అక్కున చేర్చుకున్నాం.. కానీ..
ABN , Publish Date - Jan 26 , 2024 | 12:56 PM
శాసనసభ ఎన్నికల్లో బీజేపీ టికెట్‌ను నిరాకరించి దారుణంగా అవమానిస్తే, కాంగ్రెస్ గౌరవించి ఎమ్మెల్సీ చేసి గౌరవించిందని తిరిగి బీజేపీ గూటికి చేరుకున్న మాజీ సీఎం జగదీష్ శెట్టర్‌ను ఉద్దేశించి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(Chief Minister Siddaramaiah) వ్యాఖ్యానించారు.
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): శాసనసభ ఎన్నికల్లో బీజేపీ టికెట్‌ను నిరాకరించి దారుణంగా అవమానిస్తే, కాంగ్రెస్ గౌరవించి ఎమ్మెల్సీ చేసి గౌరవించిందని తిరిగి బీజేపీ గూటికి చేరుకున్న మాజీ సీఎం జగదీష్ శెట్టర్‌ను ఉద్దేశించి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(Chief Minister Siddaramaiah) వ్యాఖ్యానించారు. కొడగు జిల్లా విరాజపేటలో గురువారం సీఎం మీడియాతో మాట్లాడారు. శెట్టర్‌కు కాంగ్రెస్ ఎనలేని గౌరవాన్ని ఇచ్చిందని ఆయనను ఏమాత్రం అవమానించలేదని సీఎం పేర్కొన్నారు. పది రోజుల కిత్రం ఒక కార్యక్రమంలో తాను శెట్టర్‌ను కలిశానని ఆపై మాట్లాడలేదన్నారు. శెట్టర్ తీరు ఒకింత బాధ కలిగించిందన్నారు. ఆయనకు మంచి జరగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఇండియా కూటమిలో లుకలకలు ఏవీ లేవని అంతా త్వరలోనే సర్దుకుంటుందన్నారు. అధిష్టానం పెద్దలు అంతా చూసుకుంటారన్నారు. కాఫీ రైతులకు ఉచిత విద్యుత్‌ను అందించే అంశాన్ని పరిశీలిసున్నామన్నారు. కనీసం 10 హార్స్‌పవర్ వరకు ఈ ఉచిత విద్యుత్ లభిస్తుందన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు ప్రధాని నరేంద్రమోదీ వస్తే ఏడాదికి 2 కోట్ల చొప్పున గత పదేళ్ళలో 20 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయో నిలదీయాలన్నారు.