Chief Minister: మేం.. ప్రజాకోర్టులో గెలిచాం..
ABN , Publish Date - Nov 24 , 2024 | 12:48 PM
ప్రజాకోర్టులో గెలిచామని ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) సంతోషం వ్యక్తం చేశారు. మూడు స్థానాల్లో మా అభ్యర్థులకు ప్రజలు ఆశీస్సులు అందించారని వారికి ధన్యవాదాలన్నారు. విజయానికి కార్యకర్తల కృషి, నాయకుల కష్టం ఉందన్నారు.
బెంగళూరు: ప్రజాకోర్టులో గెలిచామని ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) సంతోషం వ్యక్తం చేశారు. మూడు స్థానాల్లో మా అభ్యర్థులకు ప్రజలు ఆశీస్సులు అందించారని వారికి ధన్యవాదాలన్నారు. విజయానికి కార్యకర్తల కృషి, నాయకుల కష్టం ఉందన్నారు. బెంగళూరులో శనివారం మీడియాతో మాట్లాడారు. మా ప్రభుత్వ సాధనలను ప్రజలు విశ్వసించారన్నారు. కాంగ్రెస్ పార్టీ వాస్తవాలను ప్రజలు గమనించారన్నారు. బీజేపీ-జేడీఎ్‌సలు నిరంతరం తప్పుడు ప్రచారం చేసినా వారి పట్ల కనీస సానుభూతి చూపలేదన్నారు. మా ప్రభుత్వంతోపాటు నన్ను విమర్శలు చేసే పార్టీకి తగిన గుణపాఠం లభించిందన్నారు. ఏడాదిన్నర క్రిందట 135 స్థానాల్లో గెలుపొందామని ప్రస్తుతం మూడింటితో 138కి చేరిందన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Hero Vijay: రైతులకు హీరో విజయ్ విందు..
శిగ్గావిలో ముస్లిం అభ్యర్థికి టిక్కెట్ ఇచ్చినప్పుడు వ్యతిరేకత వచ్చిందని అనంతరం అక్కడివారంతా కలసి పనిచేశారన్నారు. బీజేపీ మతతత్వపార్టీకి మద్దతు ఇవ్వరాదని తీర్మానించారన్నారు. చెన్నపట్టణలో కుమార స్వామి, దేవేగౌడలు చేసిన ప్రచారంను ప్రజలు నమ్మలేదన్నారు. దేవేగౌడతో ఎన్నో ఏళ్లు కలసి ఉన్నానని అయినా నాపట్ల తీవ్రమైన ఆరోపణలు చేశారన్నారు. నా గురి సిద్దరామయ్య అంటూ అహంకారంతో మాట్లాడారన్నారు. 40ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, రెండుసార్లు సీఎంగా, డీసీఎంగా మంత్రిగా నేనెప్పుడూ అలా మట్లాడలేదన్నారు. ఎన్నికలలో కుటుంబమంతా ఏడ్చారని అయినా ప్రజలు మాకే ఓటు వేశారన్నారు.
ప్రియాంకగాంధీకి శుభాకాంక్షలు
కేరళ రాష్ట్రం వాయనాడ్‌లో ప్రియాంకగాంధీ భారీ మెజారిటీతో గెలుపు సాధించడంపై సీఎం సిద్దరామయ్య, డీసీఎం డీకే శివకుమార్‌లు హర్షం వ్యక్తం చేశారు. ప్రియాంకగాంధీకి ఫోన్‌చేసి అభినందనలు తెలిపారు. కేరళ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఝార్ఖండ్‌లో సీఎం సోరన్‌ను ఈడీ జైలుకు పంపడం, తప్పుడు కేసులో వేధించారనేది ప్రజలు గుర్తించారన్నారు.
రాష్ట్రమంతటా సంబరాలు
కాంగ్రెస్ పార్టీ విజయంతో రాష్ట్రమంతటా సంబరాలు చేసుకున్నారు. కేపీసీసీ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు సౌమ్యరెడ్డి నేతృత్వంలో కేపీసీసీ కార్యాలయం వద్ద బాణాసంచా పేల్చి స్వీట్లు పంచుకున్నారు. వేడుకలు, ర్యాలీలు నిర్వహించారు.
ఈవార్తను కూడా చదవండి: KTR: ఉమ్మడి రాష్ట్రం నాటి నిర్బంధాలు మళ్ళీ వచ్చాయి..
ఈవార్తను కూడా చదవండి: Actor Ali: సినీ నటుడు అలీకి నోటీసులు
ఈవార్తను కూడా చదవండి: బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్... కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు..
ఈవార్తను కూడా చదవండి: BJP: ఇక తెలంగాణపై కమలం గురి!
Read Latest Telangana News and National News