Share News

Chief Minister: అనవసర ఆరోపణలకు నేనెందుకు రాజీనామా చేయాలి?

ABN , Publish Date - Oct 06 , 2024 | 11:48 AM

ఎస్సీ వర్గీకరణ అమలుకు సంబంధించి రాష్ట్ర మంత్రివర్గంలో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(Chief Minister Siddaramaiah) స్పష్టం చేశారు.

Chief Minister: అనవసర ఆరోపణలకు నేనెందుకు రాజీనామా చేయాలి?

- మంత్రివర్గంలో చర్చించి వర్గీకరణపై నిర్ణయం

రాయచూరు(బెంగళూరు): ఎస్సీ వర్గీకరణ అమలుకు సంబంధించి రాష్ట్ర మంత్రివర్గంలో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(Chief Minister Siddaramaiah) స్పష్టం చేశారు. రెండు రోజుల జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శనివారం నగరంలో విలేకరులతో మాట్లాడారు. మూడా (మైసూరు అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ) ఆరోపణలకు సంబంధించి తాను రాజీనామా చేయాల్సిన అవసరమే లేదని సీఎం తేల్చి చెప్పారు. తప్పుడు ఆరోపణలపై రాజీనామా చేయాల్సిన అవసరమేముందని ప్రశ్నించారు. అదే సమయంలో ఆర్‌.అశోక్‌ తాను రాజీనామా చేస్తానని ముఖ్యమంత్రి చేయాలని చేసిన సవాలును ప్రస్తావిస్తు ఆయనపై ఇప్పటికే ఎఫ్‌ఐఆర్‌ నమోదైందని అవినీతి ఆరోపణలకు సంబందించి ప్రాథమిక ఆధారాలున్నాయని వెల్లడైనందున తొలుత ఆయన తన పదవి నుంచి తప్పుకోవాలన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Record: ఒక కుటుంబం.. 20 గిన్నిస్ రికార్డులు


అదే సమయంలో జేడీఎ్‌స-బీజేపీ నాయకులు ప్రభుత్వంపైన చేస్తున్న దుష్ప్రచారాన్ని ముఖ్యమంత్రి తీవ్రంగా ఖండించారు. ఇచ్చిన హామీలన్నింటిని సమర్థవంతంగా అమలు చేస్తున్న ప్రభుత్వం పై అక్కసుతోనే ప్రతిపక్షాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయన్నారు. జేడీఎస్‌ నాయకుడు జీటీ దేవేగౌడ తన రాజీనామాపై ప్రతిపక్షాల ఆరోపణల గురించి చేసిన వ్యాఖ్యలు వాస్తవిక దృక్పథంతో చేసినవవేనన్నారు. ముడా కమిటీలో ఆయన కూడా సభ్యుడేనని అక్కడ ఎలాంటి అక్రమాలు జరగలేదన్న విషయం ఆయనకు కూడా తెలుసన్నారు.


అదే విషయమే ఆయన వ్యాఖ్యల్లో ప్రతిధ్వనించిందని ఇందులో తప్పుపట్టాల్సిందేమి లేదన్నారు. కాగా కర్ణాటక(Karnataka) స్వర్ణోత్సవాల గురించి మాట్లాడిన ముఖ్యమంత్రి, 1973లో అప్పటి ముఖ్యమంత్రి దేవరాజ అరసు మైసూరు రాష్ట్రానికి కర్ణాటకగా నామకరణం చేసి 50 ఏళ్లు పూర్తైన సందర్భంగా జరుపుకుంటున్న ఉత్సవాల్లో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ఇది కన్నడ ప్రజలందరి సంబరమని ఇందులో ప్రతియోక్కరికి భాగస్వామ్యం ఉందన్నారు.


అదే సమయంలో గోకాక్‌ ఆందోళనలను స్మరించుకోవడం కన్నడిగులుగా మనందరి బాధ్యత అన్న ముఖ్యమంత్రి సంబరాలను విజయవంతంగా జరుపుకునేందుకు ప్రతియోక్కరు సమిష్టిగా కృషి చేయాలన్నారు. తుంగభద్ర(Tungabhadra) చివరి ఆయకట్టుకు సమర్థంగా నీరందించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపడుతుందన్నారు. జలావయంలో పూడిక పేరుకుపోవడం వల్ల నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతుంన్నందున ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం ప్రభుత్వం ఇప్పటికే తగిన చర్యలు చేపట్టిందన్నారు.


క్రస్ట్‌ గేట్‌ విరిగిన సందర్భంలోను ఐదు రోజుల్లోనే మరమ్మత్తులు జరిపి సాగు నీటికి కష్టాలు తలెత్తకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టి రైతులకు న్యాయం చేశామన్నారు. అంతకు ముందు సీఎం కర్ణాటక రాష్ట్రానికి పేరు నిర్ణయించి 50 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఉత్సవాల్లో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావడం కొత్త ఉత్తేజాన్నిస్తున్నట్లు తెలిపారు. గోకాక్‌ చళువళి హిన్నోట-మున్నోట నేరుతో శనివారం నగరంలోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఆవరణలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.


ఇదికూడా చదవండి: CM Revanth Reddy: సీఎం ఫొటోలు మార్ఫింగ్‌ చేసి.. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం

ఇదికూడా చదవండి: Hyderabad: హైదరాబాదీలకు శుభవార్త.. మళ్లీ ఓటీఎస్

ఇదికూడా చదవండి: KTR: మూసీ వెనక దాక్కున్న ముసుగు దొంగ ఎవరు?

ఇదికూడా చదవండి: Nizamabad: కుటుంబాన్ని బలిగొన్న ఆన్‌లైన్‌ బెట్టింగ్‌

Read Latest Telangana News and National News

Updated Date - Oct 06 , 2024 | 11:48 AM