Share News

చైనాలో అతిపెద్ద రవాణా డ్రోన్‌ పరీక్ష విజయవంతం

ABN , Publish Date - Aug 13 , 2024 | 03:38 AM

చైనా అతిపెద్ద మానవరహిత రవాణా డ్రోన్‌ను విజయవంతంగా పరీక్షించింది. ఆదివారం సిచువాన్‌ ప్రావిన్స్‌లో జరిగిన ఈ ప్రయోగం సందర్భంగా దాదాపు ఇరవై నిమిషాలపాటు ఈ డ్రోన్‌ ప్రయాణించింది.

చైనాలో అతిపెద్ద రవాణా డ్రోన్‌ పరీక్ష విజయవంతం

బీజింగ్‌, ఆగస్టు 12: చైనా అతిపెద్ద మానవరహిత రవాణా డ్రోన్‌ను విజయవంతంగా పరీక్షించింది. ఆదివారం సిచువాన్‌ ప్రావిన్స్‌లో జరిగిన ఈ ప్రయోగం సందర్భంగా దాదాపు ఇరవై నిమిషాలపాటు ఈ డ్రోన్‌ ప్రయాణించింది.

పూర్తిగా ప్రభుత్వ నిధులతో సిచువాన్‌ టెంగ్జెన్‌ సైన్స్‌ టెక్‌ ఇన్నోవేషన్‌ సంస్థ తయారు చేసిన ఈ డ్రోన్‌ రెక్కల పొడవు 16 మీటర్లు ఉండగా ఎత్తు 15 అడుగులు ఉంది.

ఇది రెండు ఇంజిన్లతో పనిచేస్తుంది. దాదాపు 2 టన్నుల పేలోడ్‌ను మోసుకెళ్లే సామర్థ్యం దీనికి ఉంది. చైనా ప్రభుత్వం ఇటీవలి కాలంలో తక్కువ ఎత్తులో ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించే ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని నిర్ణయించింది. తక్కువ ఎత్తులో ఎగిరే డ్రోన్‌లు, చిన్న విమానాల ద్వారా ప్రయాణికులను, సరుకులను రవాణా చేయనున్నట్లు పేర్కొంది.

Updated Date - Aug 13 , 2024 | 03:38 AM