Share News

New ambassador: 15 నెలల విరామం తర్వాత భారత్‌కు చైనా కొత్త రాయబారి

ABN , Publish Date - Jan 29 , 2024 | 06:04 PM

భారత్‌కు కొత్త రాయబారిని చైనా నియమించునుంది. అయితే ఈ నియామకంపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. 15 నెలల తర్వాత భారత్‌కు చైనా తమ రాయబారిని నియమించనుండటం ఇదే ప్రథమం. చైనాతో సరిహద్దు వివాదాల నేపథ్యంలో ఈ నియామకం ప్రాధాన్యతను సంతరించుకోనుంది.

 New ambassador: 15 నెలల విరామం తర్వాత భారత్‌కు చైనా కొత్త రాయబారి

న్యూఢిల్లీ: భారత్‌కు కొత్త రాయబారిని చైనా (China) నియమించునుంది. అయితే ఈ నియామకంపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. 15 నెలల తర్వాత భారత్‌కు చైనా తమ రాయబారిని నియమించనుండటం ఇదే ప్రథమం. చైనాతో సరిహద్దు వివాదాల నేపథ్యంలో ఈ నియామకం ప్రాధాన్యతను సంతరించుకోనుంది.


భారత్‌కు చైనా కొత్త రాయబారిగా జు ఫీహాంగ్ (Xu Feihong) నియమితులు కానున్నారని, ఆయన నామినేషన్‌ను భారత్ నోటిఫై చేసిందని 'ది వైర్' పత్రిక తెలిపింది. ఫిబ్రవరి ప్రథమార్ధంలో జు ఫీహాంగ్ కొత్త బాధ్యతలు చేపడట్టే అవకాశాలున్నట్టు పేర్కొంది. జూ ఫీహాంగ్ ప్రస్తుతం చైనా విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. దీనికి ముందు 2010 నుంచి 2013 వరకూ ఆయన ఆప్ఘనిస్థాన్ రాయబారిగా పనిచేశారు. కాగా, భారతదేశానికి చైనా గత రాయబారిగా ఉన్న సన్ వీడాంగ్ పదవీకాలం 2022 అక్టోబర్‌లో ముగిసింది.

Updated Date - Jan 29 , 2024 | 06:09 PM