Share News

100 కోట్ల సైబర్‌ నేరంలో చైనా వ్యక్తి అరెస్టు

ABN , Publish Date - Nov 20 , 2024 | 04:20 AM

వాట్సప్‌ ద్వారా ఆన్‌లైన్‌ స్టాక్‌ ట్రేడింగ్‌ చేస్తున్నానని నమ్మించి రూ.100 కోట్ల మేర మోసగించిన ఓ చైనా జాతీయుడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.

100 కోట్ల సైబర్‌ నేరంలో చైనా వ్యక్తి అరెస్టు

న్యూఢిల్లీ, నవంబరు 19: వాట్సప్‌ ద్వారా ఆన్‌లైన్‌ స్టాక్‌ ట్రేడింగ్‌ చేస్తున్నానని నమ్మించి రూ.100 కోట్ల మేర మోసగించిన ఓ చైనా జాతీయుడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. వాట్సప్‌ గ్రూపుల పేరుతో మోసం చేసిన ఫాంగ్‌ ఛెంజిన్‌ను సఫ్దర్‌జంగ్‌ ఎన్‌క్లేవ్‌లో అరెస్టు చేశామని షాహ్‌దారా డీసీపీ ప్రశాంత్‌ గౌతమ్‌ తెలిపారు. ఆన్‌లైన్‌ స్టాక్‌ మార్కెట్‌ శిక్షణ పేరుతో తనను మోసగించినట్టు సురేష్‌ కొలిచియిల్‌ అచ్యుతన్‌ అనే బాధితుడు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. పోలీసుల దర్యాప్తులో సైబర్‌ క్రైం పోర్టల్‌లో ఛెంజిన్‌పై 17 క్రిమినల్‌ కేసులు ఉన్నట్టు తేలింది. ఆంఽధ్రప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌కు చెందిన రెండు మనీలాండరింగ్‌ కేసులతోనూ ఛెంజిన్‌కు సంబంధం ఉన్నట్టు వెల్లడైంది.

Updated Date - Nov 20 , 2024 | 04:20 AM