Share News

Z category Security: కేంద్ర మంత్రికి 'జడ్' కేటగిరి భద్రత

ABN , Publish Date - Oct 14 , 2024 | 02:38 PM

చిరాగ్ పాశ్వాన్ (41)కు ఇంతకుముందు సాయుధ సరిహద్దు దళం (ఎస్ఎస్‌బీ) భద్రత కల్పించేది. సెంట్రల్ పారామిలటరీ బలగాలకు చెందిన చిన్న టీమ్ ఆయన భద్రతను చూసుకునేది.

Z category Security: కేంద్ర మంత్రికి 'జడ్' కేటగిరి భద్రత

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఫుడ్ ప్రోసెసింగ్, పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్ (Chirag Paswan)కు భద్రతను పెంచింది. సీఆర్‌పీఎఫ్ బలగాలతో 'జడ్' కేటగిరి భద్రత (Z category Security)ను కల్పించింది. ఈ మేరకు హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 10 నుంచి ఆయనకు ఈ భద్రత కల్పించినట్టు తెలిపింది. అయితే ఇందుకు కారణం ఏమిటనేది మాత్రం వెల్లడించలేదు.

Mumbai: ముంబై వెళ్లేవారికి గుడ్‌న్యూస్.. కార్లు, ఎస్‌యూవీలకు టోల్ ఛార్జీ లేదు..


చిరాగ్ పాశ్వాన్ (41)కు ఇంతకుముందు సాయుధ సరిహద్దు దళం (ఎస్ఎస్‌బీ) భద్రత కల్పించేది. సెంట్రల్ పారామిలటరీ బలగాలకు చెందిన చిన్న టీమ్ ఆయన భద్రతను చూసుకునేది. కొత్తగా కేటాయించిన "జడ్'' కేటగిరి సెక్యూరిటీతో ఆయకు సీఆర్‌పీఎఫ్ భద్రత కల్పిస్తుంది. సుమారు 36 మంది పారామిలటరీ కమండోలు వివిధ షిఫ్టుల్లో పనిచేస్తారు. ఈ కమెండోలు రేయింబవళ్లు ఆయనకు భద్రత కల్పిస్తారు. 10 మంది కమెండోలను ఆయన నివాసం వద్ద ఏర్పాటు చేశారు. సీఆర్‌పీఎఫ్ భద్రత కల్పిస్తున్న ప్రముఖుల్లో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా సహా పలువురు వీఐపీలు, కేంద్ర మంత్రులు ఉన్నారు.


మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..

ఇది కూడా చదవండి..

‘ఆయుష్మాన్‌’లో వృద్ధులకు మరిన్ని ప్రయోజనాలు

Updated Date - Oct 14 , 2024 | 02:38 PM