Home » Security
మిథున్ చక్రవర్తిని పాకిస్థాన్ గ్యాంగ్స్టర్ షాజాద్ బట్టి సోషల్ మీడియాలో బెదిరించాడు. ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందుకు 10 నుంచి 15 రోజుల లోపు క్షమాపణలు చెప్పాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని వీడియో మెసేజ్లో షాజాద్ బెదిరించాడు.
బీజేపీలో కీలక నేతగా ఉన్న సువేందు అధికారికి గతంలో 'జడ్' కేటగిరి భద్రత ఉన్నప్పటికీ అది పశ్చిమబెంగాల్ వరకే పరిమితం చేశారు. రాష్ట్రం దాటి ఎక్కడకు వెళ్లినా 'వై ప్లస్' కంటే తక్కువ భద్రత ఉండేది. దేశంలోని వీఐపీలకు గరిష్టంగా జడ్ కేటగిరి భద్రత కల్పిస్తుంటారు.
తెలంగాణ రాష్ట్ర స్పెషల్ పోలీసులు( టీజీఎస్పీ) నిరసనల నేపథ్యంలో ఇంటెలిజెన్స్ అధికారులు అప్రమత్తం అయ్యారు. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసం వద్ద భద్రతా సిబ్బందిలో కీలక మార్పులు చేశారు.
వీఐపీ సెక్యూరిటీ విధుల నుంచి కౌంటర్ టెర్రరిస్ట్ కమండో ఫోర్స్ ఎన్ఎస్జీని దశలవారిగా ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్ఎస్జీ స్థానే ఆ బాధ్యతలను సీఆర్పీఎఫ్ కు అప్పగించనుంది.
చిరాగ్ పాశ్వాన్ (41)కు ఇంతకుముందు సాయుధ సరిహద్దు దళం (ఎస్ఎస్బీ) భద్రత కల్పించేది. సెంట్రల్ పారామిలటరీ బలగాలకు చెందిన చిన్న టీమ్ ఆయన భద్రతను చూసుకునేది.
ప్రోటోకాల్ ప్రకారం హోం మంత్రి ఆదేశాల మేరకు ఢిల్లీ ముఖ్యమంత్రికి 'జడ్' కేటగిరి భద్రత వర్తిస్తుంది. జడ్ కేటగిరి భద్రత కింద షిప్టుల వారిగా ఢిల్లీ పోలీసులు 22 మందిని మోహరించారు.
ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఇంటి వద్ద ఆదివారం పోలీసులు భద్రతను పెంచారు.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ భద్రతను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మరింత పటిష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న జడ్ ప్లస్ కేటగిరి భద్రతను అడ్వాన్స్డ్ సెక్యూరిటీ లైజన్కు పెంచింది. దీంతో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమానమైన భద్రత మోహన్ భగవత్కు లభిస్తుంది.
రాష్ట్ర సర్కారీ దవాఖానాలు, వైద్య కళాశాలలు, హాస్టళ్లలో ఉంటున్న మహిళా వైద్యులు, వైద్య విద్యార్థినులకు పటిష్ఠమైన రక్షణ కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలంగాణ జూనియర్ డాక్టర్ల సంఘం (జూడా) నాయకులు కోరారు.
కోల్కతాలో వైద్యురాలిపై హత్యాచార ఘటన నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులు, మెడికల్ కాలేజీల్లో భద్రతను పెంచాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలు జారీ చేశారు.