Share News

Yogi Adityanath: ఐక్యమత్యమే బలం.. విడిపోతే చెల్లాచెదురే..!

ABN , Publish Date - Aug 26 , 2024 | 05:09 PM

ప్రజలంతా కలిసికట్టుగా ఉన్నప్పుడే దేశ సాధికారత సాధ్యమని, విడిపోతే జరిగేది వినాశనమేనని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హెచ్చరించారు. కొన్ని వారాలుగా హింసాత్మక నిరసనలు అట్టుడకడంతో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా బలవంతంగా దేశం విడిచిపెట్టిన వెళ్లిన ఘటనను ఉటంకిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Yogi Adityanath: ఐక్యమత్యమే బలం.. విడిపోతే చెల్లాచెదురే..!

ఆగ్రా: ప్రజలంతా కలిసికట్టుగా ఉన్నప్పుడే దేశ సాధికారత సాధ్యమని, విడిపోతే జరిగేది వినాశనమేనని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) హెచ్చరించారు. కొన్ని వారాలుగా హింసాత్మక నిరసనలు అట్టుడకడంతో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా బలవంతంగా దేశం విడిచిపెట్టిన వెళ్లిన ఘటనను ఉటంకిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆగ్రాలో సోమవారంనాడు రాష్ట్రవీర్ దుర్గాదాస్ రాథోడ్ విగ్రహావిష్కరణ అనంతరం జరిగిన ర్యాలీలో యోగి ఆదిత్యనాథ్ మాట్లాడారు.

Shri Krishna Janmashtami: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా అర్ధరాత్రి 12 గంటలకు అరుదైన దృశ్యం


''దేశం కంటే ఏదీ ఎక్కువ కాదు. మనమంతా సమైక్యంగా ఉన్నప్పుడే దేశ సాధికారత సాధ్యమవుతుంది. విడిపోతే నాశనం తప్పదు. బంగ్లాదేశ్‌లో ఏం జరిగిందో చూడండి. ఆ పొరపాటు ఇక్కడ జరక్కూడదు'' అని ఐక్యతా సందేశాన్ని ఇచ్చారు. దీనికి ముందు మధురలో శ్రీకృష్ణ జన్మోత్సవాలను సీఎం ప్రారంభించారు. బంకే బిహారి ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రాష్ట్ర ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు నిండాలని, అభివృద్ధి భారత్ కలను సాకారం చేసేందుకు అందరికీ తగిన శక్తిని కృష్ణ భగవానుడు ప్రసాదించాలని కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు.

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 26 , 2024 | 05:22 PM