Share News

ఎన్నికల నిబంధనల్లో మార్పులపై ‘సుప్రీం’కు కాంగ్రెస్‌

ABN , Publish Date - Dec 25 , 2024 | 04:43 AM

ఎన్నికల నిబంధనల్లో మార్పులు చేయడాన్ని కాంగ్రెస్‌ పార్టీ సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. ఎన్నికల నిర్వహణ నిబంధనలు-1961లోని రూల్‌ 93(2)(ఏ)ను కేంద్రం సవరించడంపై సర్వోన్నత న్యాయస్థానంలో రిట్‌ పిటిషన్‌ వేసింది.

ఎన్నికల నిబంధనల్లో మార్పులపై ‘సుప్రీం’కు కాంగ్రెస్‌

న్యూఢిల్లీ, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): ఎన్నికల నిబంధనల్లో మార్పులు చేయడాన్ని కాంగ్రెస్‌ పార్టీ సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. ఎన్నికల నిర్వహణ నిబంధనలు-1961లోని రూల్‌ 93(2)(ఏ)ను కేంద్రం సవరించడంపై సర్వోన్నత న్యాయస్థానంలో రిట్‌ పిటిషన్‌ వేసింది. ప్రభుత్వ చర్యలతో ఎన్నికల ప్రక్రియ సమగ్రతకు భంగం కలిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని జైరాం రమేశ్‌ మంగళవారం ఎక్స్‌ ద్వారా వెల్లడించారు. కాగా, ఎన్నికలకు సంబంధించిన ఎలకా్ట్రనిక్‌ రికార్డులను ఎవరైనా తనిఖీ చేసేందుకు అనుమతించే నిబంధనల్లో ఎన్నికల సంఘం ఇటీవల మార్పులు చేసింది. పోలింగ్‌ సీసీ టీవీ ఫుటేజీ, వెబ్‌ క్యాస్టింగ్‌ రికార్డులను తనిఖీ చేయకుండా నిషేధం విధించింది. ఎన్నికల సంఘం సిఫార్సు మేరకు ఎన్నికల నిర్వహణ నిబంధనలు-1961లోని రూల్‌ 93(2) (ఏ)ను కేంద్ర న్యాయశాఖ సవరించింది. ఈ నేపథ్యంలో.. ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరించడం, కీలకమైన చట్టాన్ని కేంద్రం సవరించడం సరికాదని జైరాం రమేశ్‌ అన్నారు.

Updated Date - Dec 25 , 2024 | 04:43 AM