Manish Tiwari: చైనా సరిహద్దు పరిస్థితులపై చర్చించండి.. ఎంపీ మనీష్ తివారీ డిమాండ్..
ABN , Publish Date - Feb 09 , 2024 | 10:48 AM
చైనా, భారత్ సరిహద్దులపై నిత్యం ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. డ్రాగన్ కవ్వింపు చర్యలకు ఇండియా సైన్యం దీటుగా సమాధానమిస్తోంది. అయినా నిత్యం ఇలాంటి పరిస్థితులే ఉండటంపై కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ లోక్ సభ వేదికగా స్పందించారు.
చైనా, భారత్ సరిహద్దులపై నిత్యం ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. డ్రాగన్ కవ్వింపు చర్యలకు ఇండియా సైన్యం దీటుగా సమాధానమిస్తోంది. అయినా నిత్యం ఇలాంటి పరిస్థితులే ఉండటంపై కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ లోక్ సభ వేదికగా స్పందించారు. చైనాతో సరిహద్దు పరిస్థితులపై చర్చించాలని కోరుతూ వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 2019 నుంచి ఇండియా, చైనా మధ్య నిరంతరం సరిహద్దు ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయని గుర్తు చేశారు. ఈ అత్యవసర సమస్యపై చర్చించాలని ప్రతిపక్షాలు ఎన్నిసార్లు డిమాండ్ చేసినా ప్రభుత్వం నుంచి కనీస స్పందన కరవైందని అన్నారు. ఈ బడ్జెట్ సెషన్ సార్వత్రిక ఎన్నికలకు ముందు 17వ లోక్‌సభ చివరి సెషన్ కాబట్టి భారత్-చైనా సరిహద్దు పరిస్థితులపై చర్చించేందుకు సభను వాయిదా వేయాలని కోరుతున్నానని లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు లేఖ రాశారు.
చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌ఏ) సైనికులు తక్‌లుంగ్ చోరోక్ లోయలో భారత్ కు చెందిన గొర్రెల కాపరులను ఎదిరించడం, సైరన్‌లు ఊది తీవ్ర వాగ్వాదానికి పాల్పడిన ఘటనను కాంగ్రెస్ ఎంపీ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ ఘటనతో భారతదేశం, చైనా మధ్య కొనసాగుతున్న సరిహద్దు ఉద్రిక్తతలకు నిదర్శనంగా మారిందన్నారు. కాబట్టి దేశ సార్వభౌమాధికారం, పౌరుల భద్రత కోసం కచ్చితమైన నిర్ణయం తీసుకోవాలని తివారీ స్పష్టం చేశారు.
ఈరోజు ఉదయం 11 గంటలకు పార్లమెంటు తిరిగి ప్రారంభం కానున్నందున కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో పదేళ్ల ఆర్థిక పరిస్థితి గురించి వివరిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన శ్వేతపత్రంపై లోక్‌సభలో సభ్యులు చర్చలో పాల్గొననున్నారు.
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.