Share News

National : ఇండియా కూటమిలోనే ఉన్నా: మమత

ABN , Publish Date - May 17 , 2024 | 04:09 AM

ఇండియా’ కూటమి సభలకు దూరంగా ఉంటున్న తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ మరోమారు స్పందించారు. ‘‘ఇండియా కూటమిని నేనే నిర్మించాను. ఆ కూటమిలోనే ఉన్నాను.

National : ఇండియా కూటమిలోనే ఉన్నా: మమత

ఆమెను విశ్వసించలేం: అధీర్‌ రంజన్‌

న్యూఢిల్లీ, మే 16: ‘ఇండియా’ కూటమి సభలకు దూరంగా ఉంటున్న తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ మరోమారు స్పందించారు. ‘‘ఇండియా కూటమిని నేనే నిర్మించాను. ఆ కూటమిలోనే ఉన్నాను. ఒకవేళ కేంద్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడితే మా పార్టీ బయటనుంచి మద్దతు ఇస్తుంది.’’ అని మమత స్పష్టం చేశారు. కూటమి విషయంలో తన వైఖరిని చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారని,

దానివల్లే తాను ఈ వివరణ ఇస్తున్నానని ఆమె తెలిపారు. అయితే, మమత మాటలను తాను విశ్వసించబోనని బెంగాల్‌ పీసీసీ అధ్యక్షుడు అధీర్‌ రంజన్‌ చౌధరీ అన్నారు. ‘‘కూటమిని మమత వదిలి పారిపోయారు. ఆమె బీజేపీతో కలిసినా ఆశ్చర్యం లేదు. కాంగ్రెస్‌ పార్టీ సర్వనాశనం అవుతుందని నిన్నటిదాకా మాట్లాడారు.. మా పార్టీకి 40 ఎంపీ సీట్లు కూడా రావని కూడా అన్నారు.

అలాంటిది ఇప్పుడు మమత మాట మారిందంటేనే.. కేంద్రంలో కాంగ్రెస్‌, కూటమి పార్టీలు అఽధికారంలోకి రానున్నాయనేది స్పష్టమవుతోంది. అవకాశవాద రాజకీయాలతో మమత విశ్వసనీయతను కోల్పోయారు’’ అని అధీర్‌ విమర్శించారు.

Updated Date - May 17 , 2024 | 04:09 AM