Congress: రైతులకు వరాలు కురిపించిన కాంగ్రెస్.. అధికారంలోకి వస్తే కీలక పథకాలు
ABN , Publish Date - Mar 14 , 2024 | 08:01 PM
లోక్ సభ ఎన్నికలకు సమాయత్తమవుతున్న కాంగ్రెస్ పార్టీ గురువారం రైతులకు వరాల వర్షం కురిపించింది. కాంగ్రెస్ పార్టీ కిసాన్ న్యాయ్ హామీల్లోని 5 ప్రధాన అంశాలను కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు ఖర్గే వెల్లడించారు.
ఢిల్లీ: లోక్ సభ ఎన్నికలకు సమాయత్తమవుతున్న కాంగ్రెస్ పార్టీ గురువారం రైతులకు వరాల వర్షం కురిపించింది. కాంగ్రెస్ పార్టీ కిసాన్ న్యాయ్ హామీల్లోని 5 ప్రధాన అంశాలను కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు ఖర్గే వెల్లడించారు.
మల్లికార్జున ఖర్గే ఢిల్లీలో మాట్లాడుతూ.. "అధికారంలోకి వస్తే కాంగ్రెస్ రైతులకు న్యాయం చేస్తుంది. దేశంలోని 62 కోట్ల మంది రైతులను బీజేపీ దురాగతాల నుంచి విముక్తి చేస్తాం. కిసాన్ న్యాయ్ ద్వారా ప్రతి రైతు జీవితంలో మళ్లీ సంతోషాన్ని నింపుతాం. స్వామినాథన్ కమిషన్ ఫార్ములా ప్రకారం MSPకి చట్టబద్ధత కల్పిస్తాం. రైతుల రుణాలను మాఫీ చేయడానికి, రుణమాఫీ మొత్తాన్ని నిర్ణయించడానికి శాశ్వత వ్యవసాయ రుణ మాఫీ కమిషన్ ఏర్పాటు చేస్తాం. బీమా ప్లాన్‌ను మార్చడం ద్వారా పంట నష్టం జరిగితే 30 రోజులలోపు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలో చెల్లింపులు చేస్తాం. రైతుల కోసం ఎగుమతి-దిగుమతి విధానాన్ని రూపొందిస్తాం. వ్యవసాయ వస్తువులపై జీఎస్టీని తొలగించడం ద్వారా రైతులను జీఎస్టీ రహితంగా తీర్చిదిద్దుతాం" అని ఖర్గే పేర్కొన్నారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి