Share News

Amitabh Bachchan: 40 ఏళ్ల తర్వాత.. ?

ABN , Publish Date - Jun 10 , 2024 | 05:14 PM

ఉత్తరప్రదేశ్. దేశంలో అత్యధిక లోక్‌సభ స్థానాలున్న రాష్ట్రం. అలాంటి రాష్ట్రంలో తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సగానికిపైగా సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. అంటే మొత్తం 80 స్థానాల్లో 43 స్థానాలు హస్తం పార్టీ హస్తగతం చేసుకుంది. అయితే అలహాబాద్ లోక్‌సభ స్థానాన్ని సైతం ఆ పార్టీ తన ఖాతాలో వేసుకుంది.

Amitabh Bachchan: 40 ఏళ్ల తర్వాత.. ?
Amitabh Bachchan

లఖ్‌నవూ, జూన్ 10: ఉత్తరప్రదేశ్. దేశంలో అత్యధిక లోక్‌సభ స్థానాలున్న రాష్ట్రం. అలాంటి రాష్ట్రంలో తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సగానికిపైగా సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. అంటే మొత్తం 80 స్థానాల్లో 43 స్థానాలు హస్తం పార్టీ హస్తగతం చేసుకుంది. అయితే అలహాబాద్ లోక్‌సభ స్థానాన్ని సైతం ఆ పార్టీ తన ఖాతాలో వేసుకుంది. దాదాపు 40 ఏళ్ల అనంతరం సదరు లోక్‌సభ స్థానాన్ని హస్తం పార్టీ గెలుచుకోవడంతో.. ఆ నియోకవర్గంలోని ఆ పార్టీ శ్రేణుల్లో సంబరాలు మిన్నంటాయి.

Also Read: LokSabha Election Result: రేపు రాయ్‌బరేలీకి రాహుల్, ప్రియాంక..?


Also Read: Modi 3.0: 18 నుంచి పార్లమెంట్ సమావేశాలు..!

1984లో ప్రధాని ఇందిరాగాంధీ హత్య కావించపడింది. అనంతరం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బాలీవుడ్ ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో ఆయన భారీ మేజార్టీతో అలహాబాద్ ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో అలహాబాద్ ఓటరు హస్తం పార్టీకి తప్పించి.. మరోపార్టీకి పట్టం కడుతూ వచ్చారు. కానీ తాజాగా జరిగిన ఎన్నికల్లో మాత్రం సదరు నియోజకవర్గ ఓటర్లు.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉజ్వల్ రమణ్ సింగ్‌ను 58 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించారు.


Also Read: Election Commission: మళ్లీ మోగిన నగారా.. జులై 10న ఎన్నికలు

ఈ లోక్‌సభ స్థానం నుంచి ఉజ్వల్ రమణ్ సింగ్ తన సమీప ప్రత్యర్థి, బీజేపీ నేత నీరజ్ త్రిపాఠిపై గెలుపొందారు. సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ రేవతి రమణ్ సింగ్ కుమారుడే ఉజ్వల్ రమణ్ సింగ్. ఆయన గతంలో సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే ఈ ఏడాది మొదట్లో ఉజ్వల్ రమణ్ సింగ్.. కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇండియా కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా అలహాబాద్ లోక్‌సభ స్థానాన్ని ఉజ్వల్‌కు కాంగ్రెస్ పార్టీ కేటాయించింది. మరోవైపు ఇదే అలహాబాద్ లోక్‌సభ స్థానం నుంచి గతంలో ప్రధానులు లాల్ బహదూర్ శాస్త్రి, విపి సింగ్‌లతోపాటు కేంద్ర మాజీ మంత్రి మురళీ మనోహర్ జోషి సైతం గెలిచిన విషయం విధితమే.


Also Read: Modi 3.0: ఇంతకీ లోక్‌సభ స్పీకర్ ఎవరు?

గత ఎన్నికల్లో అంటే.. 2019 ఎన్నికల్లో అలహాబాద్ ఎంపీగా, బీజేపీ నాయకురాలు రీటా బహుగుణ గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి.. అనంతరం ఆమె బీజేపీ గూటికి చేరారు. దాంతో ఆమెకు అలహాబాద్ ఎంపీ టికెట్ కేటాయించారు. కానీ తాజా ఎన్నికల్లో నీరజ్ త్రిపాఠీకి బీజేపీ టికెట్ ఇచ్చింది. పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ కె.ఎన్. త్రిపాఠి కుమారుడే ఈ నీరజ్ త్రిపాఠీ. గతంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అడిషనల్ అడ్వకేట్ జనరల్‌గా నీరజ్ త్రిపాఠి విధులు నిర్వహించారు. అభ్యర్థిని మారిస్తే.. విజయం దక్కుతుందని భావించిన బీజేపీ పెద్దలకు.. అలహాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుతో .. ఆ పార్టీ కేడర్‌లో నూతనోత్సాహం స్పష్టంగా కనిపిస్తుంది.

Read More National News and Latest Telugu News

Updated Date - Jun 10 , 2024 | 05:15 PM