AAP: కాంగ్రెస్, ఆప్ మధ్య కుదిరిన సయోధ్య!.. ఇండియా కూటమి మీటింగ్‌కి హాజరుకానున్న కేజ్రీవాల్
ABN , Publish Date - Jan 13 , 2024 | 11:32 AM
ఇండియా కూటమి(INDIA Alliance)లో లుకలుకలు క్రమంగా సద్దుమణుగుతున్నట్లు కనిపిస్తోంది. కూటమిలో కీలకమైన కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య సయోధ్య కుదిరినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా శనివారం ఢిల్లీలో జరగనున్న కూటమి సమావేశానికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) హాజరు అవుతారని అంటున్నారు ఆ పార్టీ నేతలు.
ఢిల్లీ: ఇండియా కూటమి(INDIA Alliance)లో లుకలుకలు క్రమంగా సద్దుమణుగుతున్నట్లు కనిపిస్తోంది. కూటమిలో కీలకమైన కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య సయోధ్య కుదిరినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా శనివారం ఢిల్లీలో జరగనున్న కూటమి సమావేశానికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) హాజరు అవుతారని అంటున్నారు ఆ పార్టీ నేతలు.
2024 లోక్‌సభ ఎన్నికల్లో(Parliament Elections 2024) సీట్ల పంపకం, అధికార భారతీయ జనతా పార్టీ(BJP)ని ఓడించే ప్రణాళికపై చర్చించడానికి ఉదయం 11.30 గంటలకు వర్చువల్ గా మీటింగ్ జరగనుంది. గతేడాది జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులో భాగంగా సీట్ల పంపకాలపై కాంగ్రెస్(Congress), ఆప్ మధ్య గ్యాప్ వచ్చింది.
దీంతో ఆప్(AAP) బహిరంగంగానే కాంగ్రెస్ పై విమర్శనాస్త్రాలు సంధించింది. అయితే కేంద్రంలో బీజేపీని సవాలు చేయాలంటే ఢిల్లీ, పంజాబ్‌లలో అధికారంలో ఉన్న ఆప్ మద్దతు కాంగ్రెస్‌కు అవసరం. విభేదాలు పరిష్కరించుకునేందుకు ఆప్, కాంగ్రెస్ నేతలు శుక్రవారం సమావేశం అయ్యారు. కాంగ్రెస్ నేత ముకుల్ వాస్నిక్ ఇంట్లో జరిగిన ఈ మీటింగ్ దాదాపు రెండు గంటల పాటు జరగ్గా ఇరు పార్టీల నేతలు సానుకూల వాతావరణంలో సమస్యలు పరిష్కరించుకున్నట్లు తెలుస్తోంది.
అయితే ఢిల్లీలోని ఏడు స్థానాల్లో పోటీ విషయంపై పీఠముడి వీడలేదు. మణిపుర్‌లో జనవరి 14న ప్రారంభం కానున్న భారత్ జోడో న్యాయ్ యాత్రలో కూటమి పార్టీల భాగస్వామ్యం కూడా ఈ సమావేశంలో అజెండాగా ఉంటుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ తెలిపారు. కాంగ్రెస్ వివిధ రాష్ట్రాల్లోని ఇండియా కూటమికి చెందిన పార్టీలతో చర్చలు ప్రారంభించింది. వారికి సీట్ల పంపకాల ప్రక్రియను పూర్తి చేసే పనిలో ఉంది.
"మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి"