High Court: భర్త వీర్యాన్ని భద్రపరచుకోవచ్చు: హైకోర్టు
ABN , Publish Date - Aug 21 , 2024 | 06:04 PM
భర్త వీర్యాన్ని భవిష్యత్తు అవసరాల కోసం భద్రపరుచుకోవచ్చని కేరళ హైకోర్టు ఓ కేసు విచారణ సందర్భంగా తీర్పునిచ్చింది. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఓ భార్య అభ్యర్థన మేరకు కోర్టు(Kerala High Court) ఈ నిర్ణయం తీసుకుంది.
తిరువనంతపురం: భర్త వీర్యాన్ని భవిష్యత్తు అవసరాల కోసం భద్రపరుచుకోవచ్చని కేరళ హైకోర్టు ఓ కేసు విచారణ సందర్భంగా తీర్పునిచ్చింది. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఓ భార్య అభ్యర్థన మేరకు కోర్టు(Kerala High Court) ఈ నిర్ణయం తీసుకుంది. కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. కేరళలో దంపతులు నివసిస్తున్నాయి. అయితే కొన్ని రోజుల క్రితం భర్త తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. భర్త ఆరోగ్యంపట్ల కలత చెందిన భార్య.. సంతానానికీ నోచుకోలేదని బాధపడేది. ఈ క్రమంలో భర్త ఆరోగ్యం మరింత క్షీణించసాగింది. భర్త ప్రస్తుం ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ప్రాణాపాయ స్థితిలో ఉన్న తన భర్త నుంచి సంతానాన్ని పొందేందుకు ఆయన వీర్య కణాలు భద్రపరచాలని ఆమె నిర్ణయించుకుంది. అయితే దానికి న్యాయస్థానం అనుమతి తప్పనిసరి అని తెలియడంతో కోర్టులో పిటిషన్ వేసింది. భార్య పిటిషన్‌పై విచారించిన న్యాయస్థానం బుధవారం తీర్పు వెలువరించింది.
భార్య వినతి..
కేసు విచారణ సందర్భంగా భార్య మాట్లాడుతూ.. తన భర్త పరిస్థితి విషమించడంతో ప్రస్తుతం ఆయన స్పృహలో లేరని అందుకే రాతపూర్వక సమ్మతి తీసుకురాలేదని కోర్టుకి తెలిపింది. తనకు ఇప్పటివరకు సంతానం కలగలేదని.. భవిష్యత్తులోనైనా పొందేందుకు తన భర్త వీర్యాన్ని భద్రపరచడానికి(Cryopreserving) అనుమతించాలని కోర్టును కోరింది. చావుబతుకుల మధ్య ఆయన కొట్టుమిట్టాడుతున్నాడని.. ఆలస్యం చేస్తే పరిస్థితి మరింత దిగజారి అతను మరణించే ప్రమాదముందని.. వెంటనే న్యాయం చేయాలని కోర్టు ఎదుట ఆవేదన వ్యక్తం చేసింది.
ఆమె పిటిషన్‌పై విచారించిన జస్టిస్ వి.జి.అరుణ్‌తో కూడిన ధర్మాసనం సానుకూల తీర్పు వెలువరించింది. భర్త నుంచి వీర్యం సేకరించి, భద్రపరచడానికి వైద్యులకు అనుమతించింది. అయితే వీర్యం సేకరణ మినహా వేరే ఏదీ చేయవద్దని వైద్యులకు సూచించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 9కి వాయిదా వేసింది.
For Latest News and Telangana News click here