రెండు గ్యారెంటీలు ఉపసంహరిస్తే మంచిది
ABN , Publish Date - Nov 27 , 2024 | 02:49 AM
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఐదు గ్యారెంటీలపై తరచూ విమర్శలు, ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ఇటీవలి శాసనసభ ఉప ఎన్నికల్లో జాతీయస్థాయిలో చర్చకు కారణమయ్యాయి.
కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలు.. డీకే శివకుమార్ ఆగ్రహం
బెంగళూరు, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఐదు గ్యారెంటీలపై తరచూ విమర్శలు, ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ఇటీవలి శాసనసభ ఉప ఎన్నికల్లో జాతీయస్థాయిలో చర్చకు కారణమయ్యాయి. తాజాగా విజయనగర జిల్లా ఎమ్మెల్యే గవియప్ప రెండు గ్యారెంటీలను వదులుకోవడం మంచిదని సోమవారం వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగళూరులో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. గ్యారెంటీలకు వ్యతిరేకంగా మాట్లాడిన ఎమ్మెల్యేపై పార్టీ క్రమశిక్షణా సమితి నుంచి నోటీసులు జారీ చేస్తామన్నారు.