Share News

Crocodile: వామ్మో.. మొసలి రోడ్డుపైనే సంచారిస్తోందిగా...

ABN , Publish Date - Mar 15 , 2024 | 12:01 PM

తిరుప్పూరు జిల్లా ఉడుమలైపేట సమీపంలోని కొళుమమం గ్రామంలో బుధవారం రాత్రి ఓ పెద్ద మొసలి(Crocodile) రోడ్డుపై సంచరించడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

Crocodile: వామ్మో.. మొసలి రోడ్డుపైనే సంచారిస్తోందిగా...

చెన్నై: తిరుప్పూరు జిల్లా ఉడుమలైపేట సమీపంలోని కొళుమమం గ్రామంలో బుధవారం రాత్రి ఓ పెద్ద మొసలి(Crocodile) రోడ్డుపై సంచరించడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల అమరావతి జలాశయం(Amaravati Reservoir) నుంచి సాగునీటి కాల్వల ద్వారా నీటిలో మొసళ్లు కొట్టుకు వచ్చి జననివాస ప్రాంతాల్లో సంచరిస్తున్నాయని ఆయా ప్రాంతాలవారు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కొళుమమం గ్రామం చెక్‌పోస్ట్‌ సమీపంలో రోడ్డుపై ఓ మొసలి సంచరించడాన్ని కొందరు సెల్‌ఫోన్‌లో వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీనితో అటవీ శాఖ అధికారులు ఆ మొసలిని పట్టుకునేందుకు చర్యలు చేపడుతున్నారు.

Updated Date - Mar 15 , 2024 | 12:01 PM