Share News

Crocodiles: సాత్తనూరు డ్యాం నుంచి తప్పించుకున్న మొసళ్లు..

ABN , Publish Date - Dec 25 , 2024 | 11:16 AM

సాత్తనూర్‌ డ్యాం, మొసళ్ల ఫాం నుంచి 150కి పైగా మొసళ్లు(Crocodiles) తప్పించుకున్నాయని దిగ్ర్భాంతికర వార్తలు వస్తున్నాయి. తిరువణ్ణామలై జిల్లా సాత్తనూరు డ్యాం సమీపంలో, ఆసియాలోనే రెండవ అతిపెద్ద మొసలి ఫాం ఉంది.

Crocodiles: సాత్తనూరు డ్యాం నుంచి తప్పించుకున్న మొసళ్లు..

చెన్నై: సాత్తనూర్‌ డ్యాం, మొసళ్ల ఫాం నుంచి 150కి పైగా మొసళ్లు(Crocodiles) తప్పించుకున్నాయని దిగ్ర్భాంతికర వార్తలు వస్తున్నాయి. తిరువణ్ణామలై జిల్లా సాత్తనూరు డ్యాం సమీపంలో, ఆసియాలోనే రెండవ అతిపెద్ద మొసలి ఫాం ఉంది. డ్యాం, ఫాంలలో అధిక సంఖ్యలో మొసళ్లు జీవిస్తున్నాయి. వేసవిలో మొసళ్లు నీటి నుంచి బయటకు వచ్చి తీరప్రాంతాల్లో సేదదీరుతుంటాయి. ఈ నెల 2న భారీవర్షాల కారణంగా తెన్‌పెన్నై నదిలో వరద ఉధృతి పెరిగింది.

ఈ వార్తను కూడా చదవండి: Chennai: జల్లికట్టు పోటీలకు మార్గదర్శకాలు విడుదల..


దీంతో, తెన్‌పెన్నై నది నుంచి సుమారు 2 లక్షల ఘనపుటడుగుల అదనపు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. ఈ వరద ఉధృతికి సాతనూరు డ్యాం, సమీపంలోని ఫాం నుంచి 150కి పైగా మొసళ్లు కొట్టుకుపోయినట్లు సమాచారం. ఈ మొసళ్లు సమీపంలోని చెరువులు, గుంటల్లో చేరగా, మరికొన్ని ముఖద్వారం మీదుగా సముద్రంలోకి వెళ్లాయని సమాచారం. ప్రస్తుతం చెరువులు, గుంటల్లో చేరిన మొసళ్లు బయటకు వస్తున్నాయి.


కడలూరు(Kadaluru)లో మాత్రమే రెండు మొసళ్లను అటవీశాఖ అధికారులు బంధించారు. చెరువు, గుంటల వద్దకు తాగునీటి కోసం వచ్చే పశువులు, స్నానాలు చేద్దామని వచ్చే వారికి ఈ మొసళ్ల వలన పెనుప్రమాదం ఉందని, ఈ విషయమై ఆయా ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసేలా అధికారులు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని సమాజ శ్రేయోభిలాషులు విజ్ఞప్తి చేస్తున్నారు.


ఈవార్తను కూడా చదవండి: Allu Arjun: తప్పయిపోయింది!

ఈవార్తను కూడా చదవండి: Ponguleti: తప్పు జరిగితే.. వేటు తప్పదు!

ఈవార్తను కూడా చదవండి: నేడు, రేపు మోస్తరు వర్షాలు

ఈవార్తను కూడా చదవండి: రుణమాఫీ చేసి తీరుతాం.. ఏ ఒక్క రైతు అధైర్యపడొద్దు

Read Latest Telangana News and National News

Updated Date - Dec 25 , 2024 | 11:16 AM