PCC Chief Posts: బెంగాల్‌కు దీపాదాస్, కేరళకు కేసీ వేణుగోపాల్.. ఖరారైన పీసీసీ అధ్యక్షుల పేర్లు
ABN , Publish Date - Aug 31 , 2024 | 01:24 PM
కాంగ్రెస్ పార్టీ(INC) 3 రాష్ట్రాలకు పీసీసీ అధ్యక్షుల ఎంపికను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. సదరు జాబితా సిద్ధమైందని శనివారం సాయంత్రం లేదా ఆదివారం ఉదయంలోపు పేర్లను ప్రకటిస్తామని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ(INC) 3 రాష్ట్రాలకు పీసీసీ అధ్యక్షుల ఎంపికను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. సదరు జాబితా సిద్ధమైందని శనివారం సాయంత్రం లేదా ఆదివారం ఉదయంలోపు పేర్లను ప్రకటిస్తామని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మూడు రాష్ట్రాలకుగానూ కొత్త పీసీసీలను(PCC Chiefs) ఖరారు చేసినట్లు సమాచారం. పశ్చిమ బెంగాల్ పీసీసీ చీఫ్‌గా దీపాదాస్ మున్షీ, కేరళకు కేసీ వేణుగోపాల్, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) పేరు ఖరారు అయినట్లు తెలుస్తోంది. కేరళకు సంబంధించి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న కేసీ వేణుగోపాల్ స్థానంలో రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్, తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇంఛార్జిగా దీపాదాస్ మున్షీ స్థానంలో ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేష్ భఘేల్‌ని నియమించనున్నట్లు తెలుస్తోంది. మరికొన్ని గంటల్లో ఈ జాబితాపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఎవరీ మహేష్ గౌడ్?
బొమ్మ మహేష్ గౌడ్ 1966 ఫిబ్రవరి 24న నిజామాబాద్ జిల్లా, భీంగల్ మండలం, రహత్‌నగర్‌లో జన్మించారు. విద్యార్థి దశ నుంచే ఆయన రాజకీయాల్లో క్రియాశీలంగా పని చేసేవారు. ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొన్నాళ్లు ఉన్నారు.1986లో నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా, జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా పని చేశారు. తొలిసారిగా 1994లో కాంగ్రెస్ అభ్యర్థిగా డిచ్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి.. ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2013 నుంచి 2014 వరకు గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ అయ్యారు. ఆ తర్వాత 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ మహేష్ గౌడ్ పోటీ చేశారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
అనంతరం పీసీసీ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 2018లో నిజామాబాద్ అర్బన్ టికెట్ ఆశించారు కానీ ఆ స్థానాన్ని అధిష్ఠానం మైనార్టీలకు కేటాయించడంతో పోటీ నుంచి తప్పుకున్నారు. 2021 జూన్- 26న పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా, 2022 డిసెంబర్- 10న కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కార్యనిర్వాహక కమిటీలో ప్రత్యేక ఆహ్వానితుడిగా, 2023 జూన్- 20న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) ఎన్నికల కమిటీలో సభ్యుడిగా నియమితులయ్యారు.
For Latest News click here