POK: పీఓకే మాదే.. ఒక్క అంగుళమూ కదలనివ్వం.. చైనాకు రాజ్ నాథ్ స్ట్రాంగ్ వార్నింగ్..
ABN , Publish Date - Apr 11 , 2024 | 03:35 PM
దేశంలో ఎన్నికల వాతావరణం నెలకొని ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో భారత్ ( India ) పై దుష్ప్రచారం చేసేవారికి తగిన గుణపాఠం చెబుతామని చైనా, పాకిస్థాన్‌లకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు.
దేశంలో ఎన్నికల వాతావరణం నెలకొని ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో భారత్ ( India ) పై దుష్ప్రచారం చేసేవారికి తగిన గుణపాఠం చెబుతామని చైనా, పాకిస్థాన్‌లకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు. ప్రధాని మోదీ అధికారంలో ఉండగా భారత దేశం నుంచి ఒక్క అంగుళం భూమినీ ఆక్రమించలేరని అన్నారు. ఉగ్రవాద భారాన్ని పాకిస్థాన్ భరించాల్సి వస్తుందని దాయాది దేశానికి వార్నింగ్ ఇచ్చారు. పీఓకే ఇండియాదేనని స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని నియంత్రించలేమని పాకిస్థాన్ భావిస్తే ఉగ్రవాద నిర్మూలనకు భారతదేశం సహకరించడానికి సిద్ధంగా ఉందని వెల్లడించారు.
Rains: సమయానికి ముందే వచ్చేస్తున్నాయ్.. భారీ వర్షాలు కురిపించేస్తాయ్..
సంభాల్‌లో జరిగిన బహిరంగ సభలో మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాల్గొన్నారు. దేశం సురక్షితమైన చేతుల్లో ఉందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. జమ్మూ కశ్మీర్ నుంచి ఆర్టికల్ 370ని తొలగించినప్పటి నుంచి వేర్పాటువాదం, రాళ్ల దాడి వంటి ఘటనలు జరలేదని చెప్పారు. కశ్మీర్ ప్రశాంతంగా ఉందని, తమనూ కశ్మీర్‌లో భాగం చేయాలని పీఓకే ప్రజలు చెప్పే అవకాశం ఉందని రాజ్ నాథ్ వివరించారు.
Haryana: స్కూల్ బస్ బోల్తా.. ఏడుగురు చిన్నారులు మృతి..
ఇటీవల అరుణాచల్ ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల పేర్లను చైనా మార్చేసింది. ఇది తీవ్ర దుమారం రేపింది. పేర్లు మార్చినంత మాత్రానా చైనాకు ఒనగూరేది ఏమీ లేదని భారత మంత్రులు ఘాటుగా స్పందించారు. చైనా స్థలాల పేర్లను భారత్ మారిస్తే అవి భారత్‌గా మారతాయా అని రాజ్ నాథ్ సూటిగా ప్రశ్నించారు.
మరిన్ని జాతీయం వార్తల కోసం క్లిక్ చేయండి.