Share News

Delhi : బంగ్లాదేశ్‌లో కర్ఫ్యూ

ABN , Publish Date - Jul 21 , 2024 | 05:36 AM

బంగ్లాదేశ్‌.. ఆందోళనలు, నిరసనలతో అట్టుడుకుతోంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో స్వాతంత్య్ర సమరయోధుల వారసులకు కల్పించిన 30 శాతం రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ అక్కడి ప్రజలు చేస్తున్న పోరాటం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తోంది.

Delhi : బంగ్లాదేశ్‌లో కర్ఫ్యూ

  • వెయ్యి మంది భారత విద్యార్థుల వెనక్కి

  • చిక్కుకున్న మరో 4 వేల మంది

న్యూఢిల్లీ, జూలై 20: బంగ్లాదేశ్‌.. ఆందోళనలు, నిరసనలతో అట్టుడుకుతోంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో స్వాతంత్య్ర సమరయోధుల వారసులకు కల్పించిన 30 శాతం రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ అక్కడి ప్రజలు చేస్తున్న పోరాటం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. ఆందోళనకారులు, అధికార అవామీ లీగ్‌ విద్యార్థి సంఘం కార్యకర్తలు బాహాబాహీకి దిగడంతో ఘర్షణలు హింసాత్మకంగా మారాయి.

అలర్లలో శనివారం వరకు 115 మంది మరణించినట్లు తెలుస్తోంది. ఘర్షణలు హింసాత్మకంగా మారడంతో షేక్‌ హసీనా ప్రభుత్వం శుక్రవారం అర్ధరాత్రి నుంచి దేశం మొత్తం కర్ఫ్యూ విధించింది. ఆర్మీని రంగంలోకి దించింది. అటూ బంగ్లా నుంచి శనివారం నాటికి వెయ్యి మంది భారతీయ విద్యార్థులు స్వదేశానికి వచ్చారని, మరో నాలుగు వేల మంది వివిధ వర్సిటీ హాస్టల్స్‌లో చిక్కుకుపోయారని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ‘‘విద్యార్థులు తిరిగి రావడానికి ఢాకాలోని భారత హై కమిషన్‌ అన్ని ఏర్పాట్లు చేస్తోంది’’ అని భారత విదేశాంగ అధికార ప్రతినిధి రణధీర్‌ జైశ్వాల్‌ తెలిపారు.

Updated Date - Jul 21 , 2024 | 05:38 AM