Share News

Delhi Blast: పేలుడు ప్రాంతంలో పౌడర్ మిశ్రమం, వైర్‌లు

ABN , Publish Date - Oct 20 , 2024 | 03:39 PM

దేశరాజధానిలోని ప్రశాత్ విహార్ ఏరియాలో ఉన్న సీఆర్‌పీఎఫ్ కార్యాలయం సమీపంలో శనివారం ఉదయం జరిగిన పేలుడు ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుగుతోంది. ఘటనా స్థలంలో తెల్లడి పౌడర్ మిశ్రమాన్ని కనుగొన్నట్టు అధికారులు తెలిపారు.

Delhi Blast: పేలుడు ప్రాంతంలో పౌడర్ మిశ్రమం, వైర్‌లు

న్యూఢిల్లీ: దేశరాజధానిలోని ప్రశాత్ విహార్ ఏరియాలో ఉన్న సీఆర్‌పీఎఫ్ (CRPF) కార్యాలయం సమీపంలో శనివారం ఉదయం జరిగిన పేలుడు ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుగుతోంది. ఘటనా స్థలంలో తెల్లడి పౌడర్ మిశ్రమాన్ని (White powder-like substance) కనుగొన్నట్టు అధికారులు తెలిపారు. ఈ పౌడర్ శాంపిల్స్‌ను ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీ, ఎన్‌ఎస్‌జీ బృందాలు సేకరించాయని చెప్పారు. పేలుడు పదార్ధాల చట్టం కింద ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేసును అధికారికంగా స్పెషల్ సెల్‌కు బదిలీ చేయనున్నారు.

Blast: సీఆర్‌పీఎఫ్ స్కూల్ సమీపంలో పేలుడు.. ఘటనా స్థలానికి అధికారులు


విచారణపై..

స్పెషల్ సెల్, ఎన్ఐఏ, సీఆర్‌పీఎఫ్, ఎఫ్ఎస్‌ఎస్, ఎన్‌ఎస్‌జీ బృందాలు ఘటనా స్థలిలో ఆధారాలు సేకరిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఆ ప్రాంతంలో కొన్ని వైర్లు కనిపించాయి. వీటిని బాంబు పేలుడుకు ఉపయోగించారా, లేక అంతకుముందు అక్కడ పడేసి ఉన్నాయా అనే దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. తెల్లటి పౌడర్ మిశ్రమం ఏమై ఉంటుందనే దానిని కూడా విశ్లేషిస్తున్నారు. దీనికి మండించే స్వభావం ఎక్కువగా, పేలుడు తీవ్రత తక్కువగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఆధునిక పరిజ్ఞానంతో ఏరియా మొత్తాన్ని ఎన్‌ఎస్‌జీ మ్యాపింగ్ చేస్తోంది. బాంబు పెట్టిన వ్యక్తిని గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు.


ఢిలీ ముఖ్యమంత్రి స్పందన

ఘటనపై ఢిల్లీ ముఖ్యమత్రి అతిషి సమాజిక మాద్యమం 'ఎక్స్'లో స్పందించారు. ఢిల్లీలో శాంతి భద్రతలతకు జవాబుదారీ కేంద్రానిదేనని అన్నారు. ఢిల్లీలో సెక్యూరిటీ సిస్టమ్‌ను తాజా పేలుడు ఘటన బహిర్గతం చేస్తోందన్నారు. శాంతి భద్రతల బాధ్యత బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వానిదేని, కానీ బీజేపీ ఆ పని వదిలేసి ఢిల్లీలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నాలే చేస్తోందని ఆరోపించారు. ఆ కారణంగానే 1990 ముంబై పేలుళ్ల నాటి పరిస్థితే ఇవాళ్ల ఢిల్లీలో తలెత్తిందన్నారు. బహిరంగంగానే బుల్లెట్ కాల్పుల ఘటనలు చోటుచేసుకుంటున్నాయని, గ్యాంగ్‌స్టర్లు డబ్బులు దోచుకుంటున్నారని, నేరస్థుల నైతికస్థైర్యం పెరిగిందని తప్పుపట్టారు.


Read More National News and Latest Telugu New

ఇది కూడా చదవండి..

Union Minister: మరోసారి నేనే సీఎం.. సిద్దూ ప్రభుత్వం పూర్తికాలం కొనసాగదు

Updated Date - Oct 20 , 2024 | 03:42 PM