Share News

Arvind Kejriwal: రాజీనామాకు గవర్నర్ ఆపాయింట్‌మెంట్ కోరిన సీఎం.. టైమ్ ఫిక్స్

ABN , Publish Date - Sep 16 , 2024 | 05:48 PM

నలభై ఎనిమిది గంటల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన అరవింద్ కేజ్రీవాల్ లెఫ్టినెంట్ గవర్నర్‌ వీకే సక్సేనా‌ను కలుసుకునేందుకు అపాయింట్‌మెంట్ కోరారు. ఇందుకు ఎల్జీ ఆమోదించినట్టు ఆప్ తెలిపింది.

Arvind Kejriwal: రాజీనామాకు గవర్నర్ ఆపాయింట్‌మెంట్ కోరిన సీఎం.. టైమ్ ఫిక్స్

న్యూఢిల్లీ: నలభై ఎనిమిది గంటల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) లెఫ్టినెంట్ గవర్నర్‌ వీకే సక్సేనా‌ (VK Saxena)ను కలుసుకునేందుకు అపాయింట్‌మెంట్ కోరారు. మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు కలుసునేందుకు ఎల్జీ అనుమతించినట్టు 'ఆప్' వెల్లడించింది. ఈ సమయంలోనే తన రాజీనామాను కేజ్రీవాల్ సమర్పించే అవకాశాలున్నట్టు తెలిపింది.

Delhi CM: తదుపరి ఢిల్లీ సీఎం ఎవరు?.. రేసులో ఉన్నది వీళ్లే!


కాగా, ఎన్నికల వరకూ పార్టీ నేతల్లో ఒకరు ముఖ్యమంత్రిని చేయనున్నట్టు పార్టీ సమావేశంలో కేజ్రీవాల్ వెల్లడించిన నేపథ్యంలో ఇందుకు సోమవారంనాడు కసరత్తు జరిగింది. కేజ్రీవాల్‌ను ఆప్ సీనియర్ నేతలు మనీష్ సిసోడియా, రాఘవ్ చద్దా ఈరోజు ఉదయం కలుసున్నారు. మరోవైపు, కేజ్రీవాల్ జైలులో ఉన్న సమయంలో పార్టీ కీలక బాధ్యతలు నిర్వహించిన అతిషి ముఖ్యమంత్రి రేసులో ముందున్నారని ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో సునీత కేజ్రీవాల్, గోపాల్ రాయ్‌ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. గత శుక్రవారం బెయిలుపై విడుదలైన కేజ్రీవాల్ అనూహ్యంగా పార్టీ కార్యకర్తలు సమావేశంలో రాజీనామా ప్రకటన చేశారు. 48 గంటల్లో రాజీనామా చేస్తానన్నారు. సుప్రీంకోర్టు తనకు న్యాయం చేసిందని, ప్రజాకోర్టులోనూ న్యాయం జరిగిన తర్వాతే తిరిగి సీఎం సీట్లో కూర్చుంటానని చెప్పారు. ఈ ఏడాది చివర్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటే ఢిల్లీ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు.


For MoreNational NewsandTelugu News

Also Read:Uttar Pradesh: భారీ వర్షాలతో యూపీ అతలాకుతలం : 14 మంది మృతి

Also Read:Uttar Pradesh: మళ్లీ తోడేలు దాడి: బాధిత కుటుంబాలతో సీఎం యోగి భేటీ

Updated Date - Sep 16 , 2024 | 05:50 PM