Delhi CM Residence Sealed: సీఎం అతిషి నివాసానికి సీల్...బలవంతంగా సామగ్రి తొలగింపు
ABN , Publish Date - Oct 09 , 2024 | 08:51 PM
అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి ఇటీవల రాజీనామా చేయడంతో అతిషి సీఎం పగ్గాలు చేపట్టారు. కేజ్రీవాల్ తన నివాసాన్ని ఖాళీ చేయడంతో అందులోకి అతిషి ఇటీవల వచ్చి చేశారు. ఇక్కడే వివాదం మొదలైంది.
న్యూఢిల్లీ: దేశరాజధానిలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ముఖ్య నేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి (Atishi) అధికారిక నివాసానికి పీడబ్ల్యూడీ (PWD) శాఖ అధికారులు బుధవారంనాడు 'సీల్' వేశారు. సీఎం సామగ్రిని అక్కడి నుంచి తరలించారు. అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి ఇటీవల రాజీనామా చేయడంతో అతిషి సీఎం పగ్గాలు చేపట్టారు. కేజ్రీవాల్ తన నివాసాన్ని ఖాళీ చేయడంతో అందులోకి అతిషి ఇటీవల వచ్చి చేశారు. ఇక్కడే వివాదం మొదలైంది. కేజ్రీవాల్ తన బంగ్లా తాళాలను సంబంధిత శాఖకు అప్పగించ లేదని బీజేపీ ఆరోపించింది. ఈ వివాదం నేపథ్యంలో పీడబ్ల్యూబీ శాఖ చర్యలకు దిగింది. 6 ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్డులోని ఢిల్లీ సీఎం నివాసానికి సీల్ వేసింది.
Union Cabinet Decesion: 2028 వరకూ ఉచిత బియ్యం... కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
ఎల్జీ పనే: సీఎంఓ
అతిషి అధికారికి నివాసాన్ని బలవంతంగా ఖాళీ చేయించడం వెనుక లెఫ్టినెంట్ గవర్నర్ ప్రమేయం ఉందని సీఎంఓ కార్యాలయం ఒక ప్రకటనలో ఆరోపిచింది. దేశ చరిత్రలోనే ఒక సీఎం నివాసాన్ని ఖాళీ చేయించడం ఇదే ప్రథమమని పేర్కొంది. 27 ఏళ్లుగా ఢిల్లీ సీఎం భవన్ బీజేపికి అందని ద్రాక్షగా మిగిలిందని, ఆ పార్టీకే చెందిన బడా నేతకు ఆ బంగ్లాను కేటాయించేందుకు ఎల్జీ సిద్ధమవుతున్నారని ఆరోపించింది. కాగా, ఈ ఆరోపణలపై ఎల్జీ కార్యాలయం వెంటనే స్పందించలేదు.
ఏం దాచిపెట్టారు?
ఈ పరిణామాలపై బీజేపీ స్పందించింది. అరవింద్ కేజ్రీవాల్ "షీష్ మహల్''కు ఎట్టకేలకు సీల్ పడిందని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ అన్నారు. సంబంధిత శాఖ నుంచి అప్రూవల్ లేకుండా, తాళాలు తిరిగి ఇవ్వకుండా మళ్లీ బంగ్లాలోకి అడుగుపెట్టేందుకు వారు ప్రయత్నించారని అన్నారు. బంగ్లాలో రహస్యాలు ఏమి దాగున్నాయని ప్రశ్నించారు.
For More National News and Telugu News..
ఇది కూడా చదవండి..