Share News

Delhi coaching centre daths: కోర్టు కీలక ఆదేశం.. ఆరుగురు నిందితులకు సీబీఐ కస్టడీ

ABN , Publish Date - Aug 31 , 2024 | 08:54 PM

ఢిల్లీ కోచింగ్ సెంటర్‌ మరణాల కేసులో రౌస్ ఎవెన్యూ కోర్టు శనివారంనాడు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో అరెస్టయిన ఆరుగురు నిందితులను నాలుగు రోజుల సీబీఐ కస్టడీకి కోర్టు ఆదేశించింది.

Delhi coaching centre daths: కోర్టు కీలక ఆదేశం.. ఆరుగురు నిందితులకు సీబీఐ కస్టడీ

న్యూఢిల్లీ: ఢిల్లీ కోచింగ్ సెంటర్‌ మరణాల కేసు (Delhi coaching centre death)లో రౌస్ ఎవెన్యూ కోర్టు శనివారంనాడు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో అరెస్టయిన ఆరుగురు నిందితులను నాలుగు రోజుల సీబీఐ కస్టడీకి కోర్టు ఆదేశించింది. నిందితులు అభిషేక్ గుప్తా, దేశ్‌పాల్ సింగ్, తేజిందర్ సింగ్, హర్వీందర్ సింగ్, సరబ్‌జిత్ సింగ్, పర్వీందర్ సింగ్‌లను సెప్టెంబర్ 4వ తేదీ వరకూ సీబీఐ కస్టడీకి ఇస్తూ అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ నిషాంత్ గార్గ్ ఆదేశాలిచ్చారు.

Elections Commission: హర్యానా అసెంబ్లీ ఎన్నికల తేదీని సవరించిన ఈసీ.. కొత్త తేదీ ఏదంటే?


ఆగస్టు 2వ తేదీన హైకోర్టులో ఉత్తర్వులో పేర్కొ్న అంశాలు, ఇన్వెస్టిగేషన్ పరిధిని పరిగణనలోకి తీసుకుని నిందితుల కస్టోడియల్ ఇంటరేగేషన్‍ తప్పనిసరని కోర్టు ఏకీభవిస్తున్నట్టు న్యాయమూర్తి పేర్కొన్నారు. ఓల్డ్ రాజేంద్రనగర్‌లోని ఐఏఎస్ కోచింగ్ సెంటర్‌ సెల్లార్‌లోకి వరదనీరు ముంచెత్తడంతో ముగ్గురు విద్యార్థులు ఇటీవల దుర్మరణం పాలైన ఘటన ఢిల్లీని కుదిపేసింది.

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 31 , 2024 | 08:54 PM