Share News

Swati Maliwal Assult cae: సీఎం తమ తప్పేమీ లేదని నిరూపించుకోవాలన్న ఢిల్లీ ఎల్జీ

ABN , Publish Date - May 21 , 2024 | 08:04 PM

సంచలనం సృష్టించిన 'ఆప్' ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి విషయంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా మంగళవారంనాడు తొలిసారి స్పందించారు. ముఖ్యమంత్రి సాచివేత ధోరణతో వ్యవహరించకుండా తమ తప్పేమీ లేదని నిరూపించుకోవాలని అన్నారు.

Swati Maliwal Assult cae: సీఎం తమ తప్పేమీ లేదని నిరూపించుకోవాలన్న ఢిల్లీ ఎల్జీ

న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన 'ఆప్' ఎంపీ స్వాతి మలివాల్ (Swati Maliwal)పై దాడి విషయంలోఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా (VK Saxena) మంగళవారంనాడు తొలిసారి స్పందించారు. ముఖ్యమంత్రి సాచివేత ధోరణతో వ్యవహరించకుండా తమ తప్పేమీ లేదని నిరూపించుకోవాలని అన్నారు. ఈ ఘటనపై కేజ్రీవాల్ ఇంతవరకూ స్పందించకపోవడాన్ని ప్రశ్నించారు.


స్వాతి మలివాల్‌కు ఎదురైన బాధాకరమైన అనుభవం, సహచర నేతల నుంచి ఎదురవుతున్న బెదిరింపులు చూసి తాను ఆవేదన చెందినట్టు ఢిల్లీ రాజ్‌భవన్ నుంచి విడుదల చేసిన లేఖలో వీకే సక్సేనా పేర్కొన్నారు. సోమవారంనాడు తనకు స్వాతి మలివాల్ ఫోను చేసి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారని, తనకు ఎదురైన అత్యంత భాదకరమైన అనుభవనాన్ని పంచుకున్నారని తెలిపారు. సొంత సహచరుల నుంచే ఇలాంటి అనుభవాన్ని ఆమె ఎదుర్కోవడం సిగ్గుచేటని అన్నారు. సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశాలు, తనకు వస్తున్న బెదరింపులపై కూడా స్వాతి మలివాల్ ఆందోళన వ్యక్తం చేసినట్టు ఎల్జీ చెప్పారు. "కనీసం ఇప్పటికై మా ముఖ్యమంత్రి సాకుల కోసం వెతుక్కోకుండా తమ తప్పేమీ లేదని నిరూపించుకుంటారని ఆశిస్తున్నాను. ఆయన మౌనం వల్ల మహిళల భద్రతపై అనుమానాలు మరింత ఇబ్బడిముబ్బడి అవుతాయి'' అని లేఖలో ఎల్జీ పేర్కొన్నారు. స్వాతి మలివాల్ గతంలో తనపైన, తన కార్యాలయాన్ని గుడ్డిగా విమర్శిస్తూ వస్తున్నారని, అయినప్పటికీ మలివాల్‌ను శారీరక హింసకు గురిచేయడం క్షమించరాని నేరమని, ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ఎల్జీ స్పష్టం చేశారు.

ECI: సీఎంపై నోరుపారేసుకున్న బీజేపీ అభ్యర్థికి ఈసీ షాక్..


ఎల్జీ వ్యాఖ్యలపై ఆప్ స్పందన

ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా లేఖ రాసిన కొద్ది సేపటికే ఆమ్ ఆద్మీ పార్టీ స్పందించింది. బీజేపీతో కలిసి స్వాతి మలివాల్ పనిచేస్తోందనడానికి, ఎన్నికల్లో ప్రతిరోజూ ఆప్‌పై ఏదో ఒక కొత్త కుట్రతో వస్తోందనే విషయం ఎల్జీ లేఖలో రుజువైందని ఆ పార్టీ వ్యాఖ్యానించింది. ''మోదీ మునిగిపోతున్న పడవకు స్వాతి మలివాల్ మద్దతుగా నిలుస్తున్నారు. స్వాతి మలివాల్‌ను అడ్డుపెట్టుకుని ఆయన (మోదీ) ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకుంటున్నారు" అని విమర్శించింది.

Read Latest National News and Telugu News

Updated Date - May 21 , 2024 | 08:05 PM