Share News

Delhi Liquor Scam Case: మద్యం కుంభకోణంలో ఇప్పటి వరకు ఎంతమంది అరెస్టయ్యారంటే..

ABN , Publish Date - Mar 21 , 2024 | 10:10 PM

Delhi Liquor Scam Case: మద్యం కుంభకోణం వెలుగు చూసినప్పటి ఎప్పుడూ ఏదో ఒక సంచలనం ఉంటూనే ఉంది. తాజాగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్(Kejriwal Arrest) అరెస్ట్‌తో ఈ కేసు పీక్స్‌కు చేరింది. 2022లో ఈ కేసులు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఈడీ(ED), సీబీఐ(CBI) వేసే ప్రతి స్టెప్.. తీసుకునే ప్రతి నిర్ణయం రాజకీయ ప్రకంపనలు సృష్టించింది.

Delhi Liquor Scam Case: మద్యం కుంభకోణంలో ఇప్పటి వరకు ఎంతమంది అరెస్టయ్యారంటే..
Delhi Liquor Scam

Delhi Liquor Scam Case: మద్యం కుంభకోణం వెలుగు చూసినప్పటి ఎప్పుడూ ఏదో ఒక సంచలనం ఉంటూనే ఉంది. తాజాగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్(Kejriwal Arrest) అరెస్ట్‌తో ఈ కేసు పీక్స్‌కు చేరింది. 2022లో ఈ కేసులు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఈడీ(ED), సీబీఐ(CBI) వేసే ప్రతి స్టెప్.. తీసుకునే ప్రతి నిర్ణయం రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. కేజ్రీవాల్‌ అరెస్ట్‌తో ఈ కేసు చివరి అంకానికి చేరుకుంది. మరి ఈ కేసులో ఈడీ ఏం తేలుస్తుంది? న్యాయస్థానాలు ఏం తీర్పునిస్తాయి? అనేది ముందు ముందు చూడాలి. అయితే, ఈ కేసులో ఇప్పటి వరకు అనేక మంది ప్రముఖలను అరెస్ట్ చేశారు. వారిలో ఢిల్లీకి చెందిన ప్రముఖులతో పాటు.. దక్షిణాది రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు కూడా ఉన్నారు. ఈ కేసులో అరెస్ట్ అయిన వారి వివరాలు ఓసారి చూద్దాం..

లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అరెస్టు చేసినవారు..

01. సమీర్ మహేంద్రు, ఇండో స్పిరిట్స్ సంస్థ యజమాని, సెప్టెంబర్ 28,2022.

02. పి. శరత్ చంద్రా రెడ్డి, అరబిందో గ్రూప్ - ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్, నవంబర్ 11,2022.

03. బినొయ్ బాబు, పెర్నార్డ్ రిచర్డ్ కంపెనీ, నవంబర్ 11,2022.

4. అభిషేక్ బోయినపల్లి, హైదరాబాద్ వ్యాపారి, నవంబర్ 13,2022.

5. విజయ్ నాయర్, ఆప్ మీడియా ఇంచార్జ్, నవంబర్ 13,2022.

6. అమిత్ అరోరా, బడ్డీ రిటెయిల్ సంస్థ డైరక్టర్, నవంబర్ 29,2022.

7. గౌతమ్ మల్హోత్రా, మద్యం వ్యాపారి, ఫిబ్రవరి 8,2023.

8. రాజేష్ జోషి, చారియట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఫిబ్రవరి 9,2023.

9.మాగుంట రాఘవ, మద్యం వ్యాపారి, ఫిబ్రవరి 11,2023.

10. అమన్ దీప్ ధల్, బ్రిండ్ కో సేల్స్ డైరెక్టర్, మార్చి 2,2023.

11. అరుణ్ పిళ్ళై, మద్యం వ్యాపారి, మార్చి 7,2023.

12. మనీష్ సిసోడియా, ఢిల్లీ ఉపముఖ్యమంత్రి, ఫిబ్రవరి 26,2023.

14. సంజయ్ సింగ్, అక్టోబర్ 4,2023.

15. కవిత, బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు, తెలంగాణ ఎమ్మెల్సీ, మార్చి 15, 2024.

16. కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి, మార్చి 21, 2024.

ఢిల్లీ లిక్కర్ కేసులో సీబీఐ అరెస్టు చేసినవారు..

01. విజయ్ నాయర్, ఆప్ కమ్యునికేషన్ ఇంచార్జి, ఓన్లీ మచ్ లౌడర్ సంస్థ యజమాని, అరెస్ట్ సెప్టెంబర్ 27,2022.

02. అభిషేక్ బోయినపల్లి, మధ్యవర్తి - రాబిన్ డిస్టిలరీస్‌లో డైరక్టర్, అక్టోబర్ 10,2022, ఇటీవలే బెయిల్ వచ్చింది.

03. గోరంట్ల బుచ్చిబాబు, అకౌంటెంట్, ఫిబ్రవరి 8,2023, బెయిల్‌పై బయట ఉన్నారు.

04. మనీష్ సిసోడియా, ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి, మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రి, అరెస్ట్ ఫిబ్రవరి 26 ,2023.

05. అమన్ దీప్ ధల్, బ్రిండ్ కో సేల్స్ డైరెక్టర్, ఏప్రిల్ 18, 2023

06. దినేశ్ అరోరా, బడ్డీ రిటెయిల్ సంస్థ డైరక్టర్, అప్రూవర్‌గా మారిన నిందితుడు. బెయిల్ పై ఉన్నాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Mar 21 , 2024 | 10:20 PM