Thief At Flight : విమాన ప్రయాణికులే టార్గెట్..!
ABN , Publish Date - May 14 , 2024 | 01:52 PM
బస్సుల్లో.. బస్టాండుల్లో, రైళ్లలో.. రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల జేబులను చోరి చేయడం సహజంగా వింటుంటాం.. చూస్తుంటాం. కానీ విమాన ప్రయాణికులనే లక్ష్యంగా చేసుకొని వారి విలువైన ఆభరణాలను చాకచక్యంగా కొట్టేస్తున్న ఓ చోర శిఖామణి ఆటను ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ పోలీసులు కట్టించారు.
న్యూఢిల్లీ, మే 14: బస్సుల్లో.. బస్టాండుల్లో, రైళ్లలో.. రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల జేబులను చోరి చేయడం సహజంగా వింటుంటాం.. చూస్తుంటాం. కానీ విమాన ప్రయాణికులనే లక్ష్యంగా చేసుకొని వారి విలువైన ఆభరణాలను చాకచక్యంగా కొట్టేస్తున్న ఓ చోర శిఖామణి ఆటను ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ పోలీసులు కట్టించారు.
AP Election 2024: కూటమి గెలుపునకు వైసీపీ కారణం..
ఈ చోరీలకు పాల్పడుతున్న రాజేష్ కపూర్‌ను ఢిల్లీ కరోల్ బాగ్‌లో సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఎయిర్‌పోర్ట్ పోలీసు ఉన్నతాధికారులు విలేకర్లతో మాట్లాడుతూ.. విమాన ప్రయాణికుల్లో సహా ప్రయాణికుడిగా వ్యవహరిస్తూ రాజేష్ కపూర్ ఈ చోరీలకు పాల్పడ్డాడని తెలిపారు.
గతేడాదిలో 110 రోజుల్లో 200 విమానాల్లో అతడు ప్రయాణించాడని వివరించారు. విమాన ప్రయాణికుల్లో ముఖ్యంగా మహిళలు, వృద్ధ మహిళలనే లక్ష్యంగా చేసుకొని అతడు ఈ చోరీలు చేస్తున్నాడని పేర్కొన్నారు. విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో ప్రయాణికుల కదలికలను గమనించి.. అతడు తన సీటు మార్చుకొంటు ఉండేవాడని చెప్పారు. అలాగే భారత్ నుంచి విదేశాలకు అంటే.. హైదరాబాద్ నుంచి అమెరికా.. వయా ఢిల్లీ మీదగా వెళ్లే ప్రయాణికులు బ్యాగేజ్‌కు ఉన్న వివరాలను అతడు పరిశీలించి.. వాటిని చోరీ చేసే వాడని పోలీసులు తెలిపారు.
Indigo Flight: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో నిలిచిన ఇండిగో విమానం...
అయితే గత మూడు నెలల్లో విమాన ప్రయాణికులు నుంచి రెండు వేర్వేరుగా చోరీ కేసులు నమోదయ్యాయని పోలీసులు వెల్లడించారు. ఫిబ్రవరి 2వ తేదీన అమృత్‌సర్ నుంచి ఢిల్లీ వచ్చిన ఓ ప్రయణికురాలికి చెందిన రూ. 20 లక్షల విలువైన అభరణాలు చోరీ అయ్యాయి. అలాగే ఏప్రిల్ 11వ తేదీతో హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీ వచ్చిన మరో ప్రయాణికురాలికి చెందిన రూ. 7 లక్షల విలువైన అభరణాలు చోరీ అయ్యాయి.
దీంతో వారు ఢిల్లీ ఎయిర్ పోర్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా అమృత్‌సర్, ఢిల్లీ ఎయిర్ పోర్టుల్లోని సీసీ టీవీ కెమెరాలను పరిశీలించి.. రాజేష్ కపూర్ వ్యవహార శైలిపై అనుమానం వ్యక్తం చేశారు. ఆ క్రమంలో టికెట్ బుకింగ్ సమయంలో అతడు ఇచ్చిన సెల్ నెంబర్‌కు ఫోన్ చేయగా.. అది తప్పని తెలింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి.. అతడి అసలు సెల్ నెంబర్‌కు గుర్తించారు.
PM Modi Live: వారణాసిలో నామినేషన్ దాఖలు చేసిన ప్రధాని మోదీ
ఆ క్రమంలో కరోల్‌బాగ్‌లో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని విచారించగా.. అయితే అతడు చోరి చేసిన సొమ్మును ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్‌కు ఖర్చు చేస్తాడని వివరించాడని చెప్పారు. అయితే అతడిపై మొత్తం 11 కేసులు నమోదయ్యాయని.. వాటిలో గ్యాంబ్లింగ్, క్రిమినల్ కేసులతోపాటు ఎయిర్‌పోర్ట్‌ల్లో అయిదు చోరీ కేసులు సైతం ఉన్నాయన్నారు.
మరోవైపు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ సమీపంలో పహర్‌గంజ్‌లో రాజేష్‌కు రిక్కి డీలక్స్ పేరుతో గెస్ట్ హౌస్ ఉందని... అలాగే అతడికి మొబైల్ రీపేర్ షాపు సైతం ఉందని పోలీసులు వెల్లడించారు. అయితే రాజేష్ గతంలో చోరీ చేసిన బంగారు, వెండి ఆభరణాలను పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Mukesh Kumar Meena: ఏపీలో 81 శాతం పైనే పోలింగ్..
తొలుత అతడు రైళ్లలో చోరీలకు పాల్పడే వాడని.. ఆ క్రమంలో పోలీసులకు పట్టుబడడంతో కొన్నాళ్లు సైలెంట్ అయ్యారని చెప్పారు. అనంతరం విమాన ప్రయాణికులే లక్ష్యంగా చేసుకొని రాజేష్ చోరిలు చేయడం ప్రారంభించారని పోలీసులు వివరించారు.
Read Latest National and Telugu News