HIBOX Mobile APP: హైబాక్స్ సిండికేట్ కేసులో ఐదుగురికి సమన్లు జారీ చేసిన పోలీసులు
ABN , Publish Date - Oct 03 , 2024 | 05:29 PM
హైబాక్స్ మొబైల్ అప్లికేషన్ ద్వారా భారీగా పెట్టుబడి పెట్టడంతో పలువురు తీవ్రంగా నష్టపోయిన ఘటనలో దేశ రాజధాని న్యూఢిల్లీ పోలీసులు గురువారం చర్యలకు ఉపక్రమించారు. ఈ యాప్‌తో పెట్టుబడులు పెట్టండంటూ సోషల్ మీడియా ద్వారా ప్రజలపై తీవ్ర ప్రభావం చూపిన ఐదుగురు ప్రముఖ వ్యక్తులకు పోలీసులు సమన్లు జారీ చేశారు.
హైబాక్స్ మొబైల్ అప్లికేషన్ ద్వారా భారీగా పెట్టుబడి పెట్టడంతో పలువురు తీవ్రంగా నష్టపోయిన ఘటనలో దేశ రాజధాని న్యూఢిల్లీ పోలీసులు గురువారం చర్యలకు ఉపక్రమించారు. ఈ యాప్‌తో పెట్టుబడులు పెట్టాలంటూ సోషల్ మీడియా ద్వారా ప్రజలపై తీవ్ర ప్రభావం చూపిన ఐదుగురు ప్రముఖ వ్యక్తులకు పోలీసులు సమన్లు జారీ చేశారు. ఈ సమన్లు జారీ చేసిన వారిలో.. ఎల్‌విష్ యాదవ్, భారతీ సింగ్ తదితరులు సైతం ఉన్నారు.
ఈ మొబైల్ యాప్ ద్వారా దాదాపు రూ. 500 కోట్లు మేర పెట్టుబడి పెట్టి ప్రజలు నష్టపోయారు. పెట్టుబడులు పెట్టే సమయంలో మీ పెట్టుబడులను తిరిగి ఇస్తామని వారు నమ్మించారు. కానీ పెట్టుబడి పెట్టిన నగదును మాత్రం వారు అక్రమ కార్యకలాపాలకు వినియోగిస్తున్నట్లు ప్రజలు గుర్తించారు. ఆ క్రమంలో వారు ఢిల్లీ పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు.
ఈ యాప్ ద్వారా పెట్టుబడులు పెట్టాలంటూ ప్రజలపై వీరు తీవ్ర ప్రభావం చూపించారు. దీంతో ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అందులోభాగంగా వీరికి సమన్లు జారీ చేశారు. ఈ యాప్‌పై దాదాపు ఐదు వందల మంది ఫిర్యాదు చేశారని పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు. వీరి ప్రచారం కారణంగా దాదాపు 30 వేల మంది నష్టపోయారని తెలిపారు. ఈ కేసులో బాధితులుగా మారిన వారంతా యూట్యూబర్‌లు, ఇన్‌ఫ్లుయెన్సర్‌ల ద్వారా ఈ యాప్‌కు పరిచయమైనవారేనని స్పష్టం చేశారు.
అలాగే ఆ యా ప్రముఖలకు చెందిన లక్షలాది మంది అనుచరులు సైతం ఈ యాప్‌కు ప్రచారం చేశారని వివరించారు. ఈ నేపథ్యంలో యూట్యూబర్లు, అభిషేక్ మల్హన్, ఎల్విష్ యాదవ్, లక్షయ్ చౌదరి, పురవ్ ఝాతోపాటు భారతీ సింగ్‌కు సమన్లు జారీ చేశామన్నారు. ఈ కేసులో విచారణకు హాజరుకావాలని వాంగ్మూలం ఇవ్వాలని వారికి జారీ చేసిన సమన్లలో స్పష్టం చేసినట్లు పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు.
For National News And Telugu News...