Share News

Delhi: అంతా ఉత్తిదే.. ఢిల్లీ ఉష్ణోగ్రతలపై కేంద్రం

ABN , Publish Date - Jun 01 , 2024 | 06:52 PM

ఢిల్లీలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయన్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ముంగేశ్‌పుర్‌లో అత్యధికంగా 52.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు చూపించింది. దీనిపై తాజాగా కేంద్రం స్పందించింది. ఉష్ణోగ్రతలు(Delhi Temperatures) చూపించే సెన్సార్‌ సరిగా పని చేయకపోవంతోనే అధిక టెంపరేచర్ చూపించడానికి కారణమని కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు వెల్లడించారు.

Delhi: అంతా ఉత్తిదే.. ఢిల్లీ ఉష్ణోగ్రతలపై కేంద్రం

ఢిల్లీ: ఢిల్లీలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయన్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ముంగేశ్‌పుర్‌లో అత్యధికంగా 52.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు చూపించింది. దీనిపై తాజాగా కేంద్రం స్పందించింది. ఉష్ణోగ్రతలు(Delhi Temperatures) చూపించే సెన్సార్‌ సరిగా పని చేయకపోవంతోనే అధిక టెంపరేచర్ చూపించడానికి కారణమని కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు వెల్లడించారు. ఎక్స్‌లో సదరు విషయాలు వెల్లడించారు. ‘‘మే 29న ముంగేశ్‌పుర్‌లో 52.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

దీనిపై భారత వాతావరణ విభాగం విచారణ జరిపింది. మూడు డిగ్రీల సెన్సర్‌ ఎర్రర్‌ను అధికారులు గుర్తించారు. దీంతో సెన్సార్‌ని సరి చేశారు. కచ్చితమైన ఉష్ణోగ్రతల సమాచారం ఇచ్చేందుకు కృషి చేస్తున్నాం’’ అని రిజిజు వెల్లడించారు. ఈ ఉష్ణోగ్రతపై ఐఎండీ డైరెక్టర్ జనరల్ మహాపాత్ర.. సెన్సార్ పనితీరును పరిశీలిస్తున్నట్లు చెప్పారు.


దేశ రాజధానిలో ఉష్ణోగ్రతలు కొలిచేందుకు 20 చోట్ల మానిటరింగ్‌ స్టేషన్లు ఏర్పాటుచేశామని, ముంగేశ్‌పుర్‌లో అత్యధికంగా 52.9 డిగ్రీల సెల్సియస్‌ నమోదైనట్లు చూపించిందన్నారు.

ఈ స్థాయిలో ఉష్ణోగ్రత ఇప్పటివరకు నమోదు కాలేదని.. వేర్వేరు కేంద్రాల్లో ఉష్ణోగ్రతలు తగ్గాయని, కొన్నిచోట్ల 45-50 మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపారు. మిగతా వాటితో పోలిస్తే ముంగేశ్‌పుర్‌లో నమోదైన డేటా భిన్నంగా ఉండటంతో అనుమానం వచ్చి సెన్సార్‌ని చెక్ చేయించినట్లు చెప్పారు.

For Latest News and National News click here

Updated Date - Jun 01 , 2024 | 08:11 PM