Share News

BJP: సీఎం సమావేశాలకు డిప్యూటీ సీఎంల గైర్హాజర్

ABN , Publish Date - Jul 26 , 2024 | 02:42 PM

లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం యూపీ బీజేపీలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రుల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయన్న ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ ఏర్పాటు చేసిన సమావేశాలకు డిప్యూటీ ముఖ్యమంత్రులు గైర్హాజర్ కావడం చర్చనీయాంశమవుతోంది.

BJP: సీఎం సమావేశాలకు డిప్యూటీ సీఎంల గైర్హాజర్

లక్నో: ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh) బీజేపీ (BJP)లో లుకలుకలున్నాయా? అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి. యూపీ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగలడంతో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) వెంటనే అలెర్ట్ అయ్యారు. ఉప ఎన్నికలకు ముందు వరుస సమావేశాలు నిర్వహిస్తు్న్నారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో యూపీ బీజేపీ 33 సీట్లకే పరిమితమైంది. 2019 కంటే 29 సీట్లు పడిపోయాయి. సమాజ్‌వాదీ పార్టీ 37 సీట్లు గెలుచుకుని 'ఇండియా' కూటమికి బలం చేకూర్చింది. 2019 కంటే 32 సీట్లు అధికంగా ఎస్పీ గెలుచుకుంది. కాంగ్రెస్ సైతం యూపీ నుంచి 6 సీట్లు కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో యూపీ బీజేపీలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రుల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయన్న ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చాయి. తాజాగా యోగి ఆదిత్యనాథ్ ఏర్పాటు చేసిన సమావేశాలకు డిప్యూటీ ముఖ్యమంత్రులు గైర్హాజర్ కావడం చర్చనీయాంశమవుతోంది.


ప్రయాగరాజ్ డివిజిన్ మీటింగ్ గురువారంనాడు జరుగగా ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య గైర్హాజరయ్యారు. శుక్రవారం జరిగిన లక్నో డివిజన్ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ దూరంగా ఉన్నారు. సమావేశం ప్రారంభానికి కొద్దిసేపు ముందే బ్రిజేష్ ఢిల్లీకి వెళ్లిపోయారు. లక్నో కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా కూడా బ్రిజేష్ ఉన్నారు.

Kargil Vijay Diwas 2024: అగ్నిపథ్‌పై ప్రతిపక్షాల విమర్శలు.. తిప్పికొట్టిన ప్రధాని మోదీ.. పథకం ఉద్దేశం ఇది..


వరుస సమావేశాలు..

కాగా, లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఫలితాల నేపథ్యంలో యోగి వరుస సమావేశాలు కొనసాగిస్తున్నారు. జూలై 24న మోరాదాబాద్, బరేలీ డివిజన్లలో సమావేశాలు నిర్వహించారు. 25న మీరట్, ప్రయాగ్‌రాజ్ డివిజన్ ఎమ్మెల్యేలతో సమావేశామయ్యారు. ప్రయోగరాజ్ సమావేశానికి కేశవ్ ప్రసాద్ మౌర్య, లక్నో సమావేశానికి బ్రజేష్ దూరంగా ఉన్నారు. ఎన్నికల ఫలితాలను సీరియస్‌గా తీసుకున్న యోగి ఆదిత్యనాథ్ ఇటీవల పార్టీ కార్యకర్తలకు, నేతలకు దిశానిర్దేశం చేశారు. మితిమీరిన ఆత్మవిశ్వాసమే పార్టీ ఫలితాలను దెబ్బతీసిందని, కార్యకర్తలు ఇప్పట్నించే ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ విజయాలను, విపక్షాల అసత్య ప్రచారాలను వారి దృష్టికి తేవాలని పిలుపునిచ్చారు.

For Latest News and National News click here

Updated Date - Jul 26 , 2024 | 02:43 PM