Share News

బృందావనం ఆలయాల్లో పురాతన ప్రసాదాలు

ABN , Publish Date - Sep 27 , 2024 | 04:06 AM

తిరుమల లడ్డూ ప్రసాదంపై నెలకొన్న వివాదం నేపథ్యంలో బృందావనంలోని ఆలయాల్లో భక్తులకు మార్కెట్‌లో లభించే మిఠాయిలు పంపిణీ చేయకూడదని ధర్మ రక్షా సంఘం నిర్ణయించింది.

బృందావనం ఆలయాల్లో పురాతన ప్రసాదాలు

మథుర: తిరుమల లడ్డూ ప్రసాదంపై నెలకొన్న వివాదం నేపథ్యంలో బృందావనంలోని ఆలయాల్లో భక్తులకు మార్కెట్‌లో లభించే మిఠాయిలు పంపిణీ చేయకూడదని ధర్మ రక్షా సంఘం నిర్ణయించింది. దీనికి బదులు కాలానుగుణంగా లభించే పండ్లు, పూలు, డ్రైఫ్రూట్స్‌, యాలకులు, పంచదారతో తయారుచేసిన పురాతన ప్రసాదాలను అందించాలని ప్రతిపాదించింది. దేశవ్యాప్తంగా దేవాలయాల్లో అనుసరిస్తున్న ప్రసాదాల పంపిణీ విధానంలో సంస్కరణలు అవసరమని సంఘం జాతీయ అధ్యక్షుడు సౌరభ్‌ గౌర్‌ అన్నారు.

Updated Date - Sep 27 , 2024 | 04:06 AM