Share News

Flag Hoisting: స్వాతంత్ర, గణతంత్ర దినోత్సవం మధ్య తేడాలు మీకు తెలుసా?

ABN , Publish Date - Aug 14 , 2024 | 01:15 PM

ఈ ఏడాది ఆగస్టు 15, 2024న భారతదేశం తన 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని(independence day) జరుపుకోనుంది. ప్రతి ఏటా కూడా స్వాతంత్ర దినోత్సవం(ఆగస్టు 15), గణతంత్ర దినోత్సవం(republic day)(జనవరి 26) రోజున జెండా ఎగురవేస్తారు(flag hoisting). అయితే ఈ రెండింటి మధ్య ఉన్న ప్రధాన తేడాలేంటో ఇప్పుడు చుద్దాం.

Flag Hoisting: స్వాతంత్ర, గణతంత్ర దినోత్సవం మధ్య తేడాలు మీకు తెలుసా?
flag hoisting

ఈ ఏడాది ఆగస్టు 15, 2024న భారతదేశం తన 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని(independence day) జరుపుకోనుంది. బ్రిటీష్ వలసపాలన బారి నుంచి మనల్ని మనం విడిపించుకుని కొత్త ఆరంభాన్ని సృష్టించుకోవాలని ఈరోజు మన భారతీయులందరికీ గుర్తుచేస్తుంది. ఈరోజున పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలు సహా అనేక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ క్రమంలో భారతదేశంలోని అన్ని వర్గాల ప్రజలు ఈ పండుగను కులమతాలకు అతీతంగా జరుపుకుంటారు. ఆ క్రమంలో కొంతమంది త్రివర్ణ రంగుల దుస్తులు ధరిస్తారు. మరికొంత మంది నృత్యాలు చేయగా, ఇంకొంతమంది ప్రసంగాలు చేస్తుంటారు. జెండాలు ఎగురవేసిన తర్వాత ఆయా ప్రాంతాల్లో మిఠాయిలు పంచుకుని వేడుకలను ఆనందంగా జరుపుకుంటారు.


బ్రిటిష్ జెండా తొలగించి

ప్రతి ఏటా కూడా స్వాతంత్ర దినోత్సవం(ఆగస్టు 15), గణతంత్ర దినోత్సవం(republic day)(జనవరి 26) రోజున జెండా ఎగురవేస్తారు(flag hoisting). అయితే ఈ రెండింటి మధ్య ఉన్న ప్రధాన తేడాలేంటో ఇప్పుడు చుద్దాం. ఆగస్ట్ 15 స్వాతంత్ర దినోత్సవం రోజున జెండా ఎగురవేత కార్యక్రమం జరుగుతుంది. 1947లో ఈ రోజున భారతదేశం నుంచి బ్రిటిష్ రాజ్ జెండాను తొలగించి మన జాతీయ జెండాను ఎగురవేశారు. ఆ సమయంలో జాతీయ జెండాను కింది నుంచి పైకి ఎగురవేయడాన్ని జెండా ఎగురవేయడం అని అంటారు. మరోవైపు గణతంత్ర దినోత్సవమైన జనవరి 26న కూడా జెండాను ఎగురవేస్తారు. కానీ అప్పటికే జెండా స్తంభంపై ఏర్పాటు చేసిన త్రివర్ణ పతాకాన్ని దానికి పై బాగంలో కడతారు. ఆ క్రమంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసినప్పుడు పూల వర్షం కురుస్తుంది.


ఎర్రకోటపై

ఆగస్ట్ 15, 1947 స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఎర్రకోట ప్రాకారాలపై మొదటిసారిగా బ్రిటిష్ జెండాను అవనతం చేసి భారత జాతీయ జెండాను ఎగురవేశారు. అప్పటి నుంచి ఆగస్టు 15న ఎర్రకోట ప్రాకారంపై ధ్వజారోహణం జరుగుతుంది. కానీ జనవరి 26న మాత్రం రాష్ట్రపతి భవన్ సమీపంలోని డ్యూటీ పాత్‌లో కవాతుకు ముందు జెండాను ఎగురవేస్తారు. 1947 ఆగస్టు 15న ఎర్రకోటపై మొదటి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జెండాను ఎగురవేశారు. ఆ తర్వాత జనవరి 26న రాష్ట్రపతి జెండాను వేశారు.

ఇవి కూడా చదవండి:

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మళ్లీ షాక్..


మొదటి ప్రధాని

ఆగస్టు 15న అంటే స్వాతంత్ర్య దినోత్సవం రోజున జెండా ఎగురవేత కార్యక్రమం జరుగుతుంది. దీనిని ఆంగ్లంలో Flag Hoisting అంటారు. అదే సమయంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసినప్పుడు ఆంగ్లంలో ఫ్లాగ్ అన్‌ఫర్లింగ్ అంటారు. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు భారతదేశానికి అధికారికంగా రాష్ట్రపతి లేరు. ఆ సమయంలో లార్డ్ మౌంట్ బాటన్ భారత గవర్నర్ కాగా, జవహర్‌లాల్ నెహ్రూ తాత్కాలిక ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు.


ఇవి కూడా చదవండి:

Rain Alert: ఐఎండీ రెయిన్ అలర్ట్.. ఈ 17 రాష్ట్రాలకు హెచ్చరిక


Droupadi Murmu: 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నేడు జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం


సెబీ చీఫ్‌, అదానీపై.. 22న దేశవ్యాప్త ఉద్యమం

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 14 , 2024 | 01:18 PM