Share News

Doda encounter: దోడా ఘటన.. తమ పనే: కశ్మీర్ టైగర్స్ ప్రకటన

ABN , Publish Date - Jul 16 , 2024 | 04:17 PM

జమ్మూ కశ్మీర్‌ దోడా జిల్లాలోని భరద్వాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఉన్నతాధికారితో సహా నలుగురు సైనికులు మరణించారు. ఈ ఘటనకు తామే బాధ్యులమని జైషే ఈ మహమ్మద్ అనుబంధ సంస్థ కశ్మీర్ టైగర్స్ మంగళవారం ప్రకటించింది.

Doda encounter: దోడా ఘటన.. తమ పనే: కశ్మీర్ టైగర్స్ ప్రకటన

జమ్మూ కశ్మీర్, జులై 16: జమ్మూ కశ్మీర్‌ దోడా జిల్లాలోని భరద్వాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఉన్నతాధికారితో సహా నలుగురు సైనికులు మరణించారు. ఈ ఘటనకు తామే బాధ్యులమని జైషే ఈ మహమ్మద్ అనుబంధ సంస్థ కశ్మీర్ టైగర్స్ మంగళవారం ప్రకటించింది. ఈ ఎన్‌కౌంటర్‌పై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఆరోపణలు సంధిస్తున్నాయి. అయితే ఇటీవల కాలంలో ఆ రాష్ట్రంలో ఉగ్రవాద దాడులు పెచ్చురిల్లాయి.

Also Read: justice narasimha reddy: సుప్రీంకోర్టులో కేసీఆర్ పిటిషన్‌పై విచారణ ప్రారంభం

ఈ నేపథ్యంలో జమ్మూ కశ్మీర్‌కు చెందిన పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షురాలు మొహబూబా ముఫ్తీ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఉన్న సైనికులంతా విధి నిర్వహాణలో భాగంగా జమ్మూ కశ్మీర్‌కు వస్తున్నారన్నారు. కానీ వారు మాత్రం శవపేటికల్లో తిరిగి వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి బాధ్యులు ఎవరిని ప్రశ్నించారు. కశ్మీర్ వ్యాలీలో ఉగ్రవాదానికి ముగింపు ఎప్పుడని ఆమె ప్రశ్నించారు.

Also Read:Doda encounter: ప్రభుత్వమే బాధ్యత వహించాలి

రాష్ట్రంలో ఈ డీజీపీ నియామకమైన నాటి నుంచి ఈ తరహా ఘటనలు 32 చోటు చేసుకున్నాయని వివరించారు. ఈ ఉగ్రవాదుల దాడుల్లో అత్యధిక మంది మరణించారని తెలిపారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై ఆమె విమర్శలు గుప్పించారు. చోరబాట్లను ఆపే బాధ్యత ఎవరిదంటూ ఈ సందర్భంగా మోదీ ప్రభుత్వాన్ని మొహబూబా ముఫ్తీ సూటిగా ప్రశ్నించారు.

Also Read:Chandrababu Govt: జులై 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం


  • మరోవైపు ఈ ఘటనపై రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. క్షేత్రస్థాయిలో ఇండియన్ ఆర్మీ చీఫ్ పర్యవేక్షిస్తున్నారన్నారు.

  • ఇక జులై 9వ తేదీన కతువాలో ఇండియన్ ఆర్మీ కాన్వాయి‌పై దాడి జరిగింది. ఈ ఘటనకు తామే బాధ్యులమంటూ కశ్మీర్ టైగర్స్ ప్రకటింది.

  • ఈ ఎదురు కాల్పుల్లో 10 రాష్ట్రీయే రైఫిల్స్‌కు చెందిన మేజర్ బ్రిజేష్ తాపా సహా నలుగురు సైనికులు మరణించారు. అయితే మేజర్‌గా బ్రిజేష్ తాపా ఇటీవల ప్రమోషన్ వచ్చింది.

  • గత రాత్రి దోడా పట్టణానికి 55 కిలోమీటర్ల దూరంలో రాష్ట్రీయ రైఫీల్స్, జమ్మూ కశ్మీర్‌ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో ఉగ్రవాదులు తప్పించుకోనేందుకు ప్రయత్నించారు. అందుకు ప్రతిగా సైనికులు కాల్పులు ప్రారంభించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో అయిదుగురు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో నలుగురు మృతి చెందారు.

  • ఇక ఉగ్రవాదుల జాడ కనుగోనేందుకు ద్రోణులు, హెలికాఫ్టర్లను భారత సైతం వినియోగించింది.

    Read Latest AP News and Telugu News

    Read Latest Telangana News and National News

    Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 16 , 2024 | 04:23 PM