Home » Encounter
నారాయణపూర్ జిల్లా అబూజ్ మడ్ అటవీ ప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయి మృతిచెందారు.
National: ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతంలో మరోసారి కాల్పుల మోత మోగింది. దంతెవాడ జిల్లాలో గురువారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఎగువ డచిగామ్ ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలపై సమాచారం అందడంతో జమ్మూ కశ్మీర్ పోలీసులు, ఆర్మీ సంయుక్తంగా గందేర్బల్లో సంయుక్త ఆపరేషన్ నిర్వహించినట్టు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన ఎన్కౌంటర్లో లష్కరే తొయిబా కేటగిరి-ఎ తీవ్రవాద జునైద్ అహ్మద్ భట్ మరణించినట్టు చెప్పారు.
తెలంగాణలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఏటూరు నాగారం మండలం ఏజెన్సీ అడవుల్లో ఇవాళ(ఆదివారం) ఉదయం భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోలు మృతిచెందారు. చల్పాక అటవీ ప్రాంతంలో గ్రేహౌండ్స్ బలగాలు, మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు జరిగాయి.
ఎదురు కాల్పుల్లో మృతిచెందిన ఏడుగులు మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు ట్రాక్టర్లలో ఏటూరు నాగారం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారి మృతదేహాలకు మరికాసేపట్లో పోస్టుమార్టం నిర్వహించనున్నారు. మృతిచెందిన మావోయిస్టుల వివరాలను పోలీసులు వెల్లడించారు.
మావోయిస్టుల కంచుకోట అబుజ్మడ్ మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. పోలీసులు-నక్సల్స్‌కు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఐదుగురు మావోయిస్టులు మరణించగా.. ఇద్దరు జవాన్లకు బుల్లెట్ గాయాలయ్యాయి.
నక్సల్స్‌కు గట్టిపట్టున్న దట్టమైన అటవీ ప్రాంతాల్లో సంయుక్త భద్రతా బలగాలు గాలింపు జరుపుతుండగా ఈ ఎన్కౌంటర్ చోటుచేసుకున్నట్టు ఛత్తీస్‌గఢ్ పోలీసులు తెలిపారు. ఇది చాలా కీలకమైన ఆపరేషన్ అని, కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
జమ్మూ-కశ్మీర్‌లోని కిష్టావర్ జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లో ఓ ఆర్మీ అధికారి ప్రాణాలు కోల్పోగా, ముగ్గురు జవాన్లు గాయపడ్డారు.
అధికారిక సమాచారం ప్రకారం, గత గురువారం సాయంత్రం ఇద్దరు విలేజ్ డిఫెన్స్ గార్డులను ఉగ్రవాదులు హతమార్చినప్పటి నుంచి కుంత్వారా, కేష్వాన్ అటవీ ప్రాంతాల్లో గాలింపు చర్యలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే కేశ్వాస్-కిష్ట్వార్ మధ్య టెర్రరిస్టులకు, బలగాలకు మధ్య ఎన్కౌంటర్ చోటుచేసుకుంది
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో శుక్రవారం ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. ఈ మేరక్ ఐజీ సుందర్ రాజ్ వెల్లడించారు. ఘటన స్థలంలో ఆయుధాలు సైతం లభ్యమయ్యానని తెలిపారు.