Share News

EVMs FAQ: ఈవీఎంకు ఆపరేటింగ్ సిస్టమ్ ఉందా? ఎన్నికల సంఘం ఏమందంటే

ABN , Publish Date - Feb 08 , 2024 | 07:53 AM

ఎన్నికల్లో ఉపయోగించే ఈవీఎం మిషన్లపై తరచూ ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తుంటాయి. ఈవీఎం(EVM)లు ట్యాంపరింగ్‌కి గురవుతున్నాయని తద్వారా ఎన్నికల ఫలితాలు తారుమారు అవుతున్నాయని పలు పార్టీలు ఆరోపిస్తూ వస్తున్నాయి. అయితే వీటన్నింటికీ భారత ఎన్నికల సంఘం (ECI) సమాధానం ఇచ్చింది.

EVMs FAQ: ఈవీఎంకు ఆపరేటింగ్ సిస్టమ్ ఉందా? ఎన్నికల సంఘం ఏమందంటే

ఢిల్లీ: ఎన్నికల్లో ఉపయోగించే ఈవీఎం మిషన్లపై తరచూ ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తుంటాయి. ఈవీఎం(EVM)లు ట్యాంపరింగ్‌కి గురవుతున్నాయని తద్వారా ఎన్నికల ఫలితాలు తారుమారు అవుతున్నాయని పలు పార్టీలు ఆరోపిస్తూ వస్తున్నాయి. అయితే వీటన్నింటికీ భారత ఎన్నికల సంఘం (ECI) సమాధానం ఇచ్చింది. అనేక ప్రశ్నలకు సంబంధించి ఫిబ్రవరి 7న ఎన్నికల కమిషన్ అధికారిక వెబ్‌సైట్‌లో వివరణ ఇచ్చింది. ఈవీఎంలకు ఆపరేటింగ్ సిస్టమ్ (OS) లేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అభ్యర్థుల పేర్లు, గుర్తులు బ్యాలెట్ బాక్స్‌లోకి ఎలా ప్రవేశిస్తాయో కూడా కమిషన్ వివరించింది.

BEL, ECIL తయారు చేసిన విండో ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారిత సింబల్ లోడింగ్ అప్లికేషన్ సాయంతో పోటీలో ఉన్న అభ్యర్థులు లేదా వారి ప్రతినిధుల సమక్షంలో సింబల్ లోడింగ్ యూనిట్ (SLU)లో గుర్తులు లోడ్ అవుతాయని పేర్కొంది. BEL (భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్), ECIL (ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్) రెండూ రక్షణ మంత్రిత్వ శాఖ, అణు ఇంధన శాఖ పరిధిలో వస్తాయి. గుర్తు, పేరు అప్‌లోడ్ అయ్యాక ఓటర్లు ఓటు వేసిన తరువాత వీవీప్యాట్(VVPAT) స్లిప్‌లు తాము ఓటు వేసిన అభ్యర్థిని నిర్ధారిస్తాయి.


అభివృద్ధి చెందిన దేశాల్లో ఈవీఎంలు లేవుగా

ఈ ప్రశ్నకు కూడా ఈసీ సమాధానం ఇచ్చింది. అమెరికా(USA), ఆస్ట్రేలియా, కెనడా, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా, భూటాన్ వంటి అనేక దేశాలు డైరెక్ట్ రికార్డింగ్ మిషన్లను ఉపయోగిస్తున్నాయని తెలిపింది. EVM అనేది శాసన ఆమోదం ఉన్న డైరెక్ట్ రికార్డింగ్ మిషన్. అందుకే ఈవీఎంలను వాడుతున్నట్లు వివరించింది.

ఈవీఎంలపై ప్రశ్నలు - సమాధానాలు ఈసీ అప్‌డేట్ చేయడం ఈ ఏడాది రెండోసారి. ఈవీఎం మిషన్‌లోని బ్యాలెట్ యూనిట్ అంటే, ఓటరు బటన్‌ నొక్కిన పరికరం, కంట్రోల్ యూనిట్ అనేది అన్ని ఓట్లను నిల్వ చేసేది, బటన్ నొక్కగానే స్లిప్‌ను VVPAT ప్రింట్ చేస్తుంది.

Updated Date - Feb 08 , 2024 | 07:54 AM