Share News

కమలా హారిస్ ఓటమిని జీర్ణించుకోలేకున్న పూర్వీకుల గ్రామం

ABN , Publish Date - Nov 06 , 2024 | 07:50 PM

హారిస్ గెలుపుపై ధీమాతో దీపావళి కంటే పెద్ద సంబరం జరుపుకునందుకు సిద్ధమైన తమిళనాడులోని కమలా హారిస్ తల్లిగారి స్వగ్రామం తులసేంద్రపురం ఒక్కసారిగా మూగవోయింది. అయితే ఊహించని పరాజయం నుంచి తిరిగి ఒక కెరటంలా ఆమె ఏదో ఒక రోజు దూసుకు వస్తారని పలువురు గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేశారు.

కమలా హారిస్ ఓటమిని జీర్ణించుకోలేకున్న పూర్వీకుల గ్రామం

తులసేంద్రపురం: గెలుపు ఎవరికైనా ఉత్సాహాన్ని, ఓటమి నిరాశను కలిగించడం సహజం. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడంతో ఆయనకు ప్రత్యర్థిగా చివరివరకూ గట్టి పోటీనిచ్చిన కమలా హారిస్ (Kamala Harris) స్వగ్రామంలో నిరాశా నిస్పృహలు చోటుచేసుకున్నాయి. హారిస్ గెలుపుపై ధీమాతో దీపావళి కంటే పెద్ద సంబరం జరుపుకునందుకు సిద్ధమైన తమిళనాడు (Tamilnadu)లోని కమలా హారిస్ తల్లిగారి స్వగ్రామం తులసేంద్రపురం (Thulasendrapuram) ఒక్కసారిగా మూగవోయింది. అయితే ఊహించని పరాజయం నుంచి తిరిగి ఒక కెరటంలా ఆమె ఏదో ఒక రోజు దూసుకు వస్తారని పలువురు గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ కు విషెస్ చెప్పని పుతిన్..


విజయాన్ని సెలబ్రేట్ చేసుకుందామనుకుంటే..

కమలా హారిస్ విజయంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నామని, దీపావళి కంటే మిన్నగా సెలబ్రేషన్స్‌కు ఏర్పాట్లు చేసుకున్నామని తులసేంద్రపురం గ్రామ నేత, డీఎంకే తిరువారూరు జిల్లా ప్రతినిధి జె.సుధాకర్ తెలిపారు. బాణసంచా, స్వీట్లు, ఆలయాల్లో ప్రత్యేక పూజలు, కమ్యూనిటీ లంచ్ కోసం విస్తృత ఏర్పాట్లు చేశామన్నారు. హారిస్ చాలా గట్టి పోరాటం చేశారని, ఆమె పోరాట స్ఫూర్తిని మాత్రం తప్పనిసరిగా అభినందించాల్సిందేనని అన్నారు.


ఓటమిని జీర్ణించుకోలేకున్నాం

గ్రామంలోని దాదాపు అందరూ హారిస్ గెలుస్తారనే నమ్మకంతో ఉన్నామని, అయితే ఊహించని ఓటమిని తాము జీర్ణించుకోలేకున్నామని రిటైర్డ్ ఓఎన్‌జీసీ ఉద్యోగి టీఎస్ అంబరసు తెలిపారు. హారిస్ వయస్సు 60 ఏళ్లే కావడం ఒకింత ఊరట కలిగించే అంశమని, వచ్చే ఎన్నికల్లో ఆమె తప్పనిసరిగా గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. 78 ఏళ్లలో ట్రంప్ గెలిచారని, ఓటమికి తలొంచకుండా హారిస్ పట్టుదలగా ముందుకు వెళ్తారని తాము ఆశిస్తున్నట్టు చెప్పారు. భవిష్యత్తులో గెలిచిన తర్వాత ఆమె తప్పనిసరిగా స్వగ్రామానికి వస్తారని ఆశిస్తున్నామని అన్నారు. కొద్ది సంవత్సరాల క్రితం హారిస్ సొంత గ్రామానికి వస్తారని అనుకున్నామని, ఆమె బంధువులకు మెసేజ్‌లు కూడా పంపామని, ఈరోజు తమ గ్రామం పర్యాటక ప్రాంతంగా మారిందంటే ఆమెనే కారణమని అన్నారు. వచ్చేసారి ఆమె గెలుపుతో స్వగ్రామానికి వచ్చినప్పుడు ఆమెకు పెద్దఎత్తున సాదర సత్కారాలు చేస్తామని చెప్పారు. హారిస్‌పై విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్‌కు అభినందనలు తెలిపారు. ఇండియాతో సత్సంబంధాలను ట్రంప్ వృద్ధి చేస్తారని, ప్రపంచ శాంతికి దోహడపడతారని ఆశిస్తున్నట్టు చెప్పారు.


ఇవి కూాడా చదవండి

PM Modi: నా బెస్ట్ ఫ్రెండ్‌కు విషెస్..మోదీ ట్వీట్

Chief Minister: సీఎం సిద్దరామయ్య ఆసక్తికర కామెంట్స్.. 40 ఏళ్లకిందటే మంత్రిగా పనిచేశా

For More National and telugu News

Updated Date - Nov 06 , 2024 | 08:19 PM