Amith Shah: ఆర్టికల్ 370ని మార్చే ధైర్యం ఉందా.. కాంగ్రెస్‌కు అమిత్ షా గట్టి హెచ్చరిక

ABN, Publish Date - Apr 11 , 2024 | 08:18 PM

జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేసే ధైర్యం కాంగ్రెస్‌కు ఉందా అని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) ప్రశ్నించారు. మధ్యప్రదేశ్‌లో గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ.. ఆర్టికల్ 370ని మార్చడానికి ధైర్యం చేయవద్దని కాంగ్రెస్‌ను హెచ్చరించారు.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

ఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేసే ధైర్యం కాంగ్రెస్‌కు ఉందా అని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) ప్రశ్నించారు. మధ్యప్రదేశ్‌లో గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ.. ఆర్టికల్ 370ని మార్చడానికి ధైర్యం చేయవద్దని కాంగ్రెస్‌ను హెచ్చరించారు.

ఆర్టికల్ రద్దు నిర్ణయం వెనక ప్రధాని మోదీ, బీజేపీ కార్యకర్తలు ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రాలేదని, ఒక వేళ యాదృచ్చికంగా అధికారంలోకి వస్తే ఆర్టికల్ 370ని మార్చడానికి ధైర్యం చేయవద్దని సూచించారు. కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని, కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలు ముగిశాయని షా అన్నారు. మాండ్లాలో జరిగిన బహిరంగ ర్యాలీలో గిరిజనుల అభివృద్ధికి బీజేపీ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని చెప్పారు.

Rahul Gandhi: రైతులు ఎంఎస్‌పీ, యువత ఉద్యోగాలు అడుగుతున్నారు మోదీజీ.. ప్రధానిపై రాహుల్ వ్యంగ్యాస్త్రాలు

గిరిజనుల ఆధార్య దైవం బిర్సాముండా పుట్టిన రోజున జన్‌జాతీయ గౌరవ్ దివాస్‌గా జరుపుకోవాలనేది మోదీ ఆలోచన అని తెలిపారు. “మొదటి జనజాతీయ గౌరవ్ దివస్‌ను మధ్యప్రదేశ్‌లో (నవంబర్ 15, 2021న) జరుపుకున్నారు. గిరిజనుల కోసం బీజేపీ పెసా చట్టాన్ని అమలు చేసింది’’ అని అమిత్ షా అన్నారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated at - Apr 11 , 2024 | 08:19 PM