Home » Article 370 Abrogation
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ధులేలో జరిగిన ఎన్నికల ర్యాలీలో మోదీ శుక్రవారంనాడు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ పాకిస్థాన్ ఎజెండాను, కశ్మీర్లో వేర్పాటువాద భాషను ఇక్కడ కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలను ఓటర్లు తిప్పికొట్టాలన్నారు.
రానున్న జమ్మూ-కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్- కాంగ్రె్‌సలు పొత్తు కుదుర్చుకోవడంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా మండిపడ్డారు.
జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు మూడు విడతలుగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఉపాధ్యక్షుడు, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా సోమవారం శ్రీనగర్‌లో తమ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఆర్టికల్ 370తోపాటు 35ఏని పునరుద్దరిస్తామని ఆయన స్పష్టం చేశారు. వీటితోపాటు మరో 10 అంశాలను మేనిఫెస్టో జాబితాలో పొందు పరిచారు.
భారత దేశ చరిత్రలో ఆర్టికల్ 370 రద్దు కీలక మలుపు అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. నాటి నిర్ణయం ప్రజల సమ్మతితోనే జరగాలని భావించానని ఆయన తెలిపారు. ఐదేళ్ల క్రితం తాము తీసుకున్న నిర్ణయం జమ్మూ, కశ్మీర్, లఢఖ్‌లలో కొత్త శకానికి నాంది అని మోదీ వ్యాఖ్యానించారు.
మోదీ ప్రభుత్వం ‘ఆర్టికల్ 370’ని రద్దు చేసి.. నేటికి అంటే ఆగస్ట్ 5వ తేదీకి అయిదేళ్లు పూర్తయింది. ఈ నేపథ్యంలో జమ్మూ కశ్మీర్లో ఆర్ఎస్ పురాలోని బానా సింగ్ స్టేడియంలో ఏకాత్మ మహోత్సవ్ ర్యాలీని బీజేపీ చేపట్టనుంది. సరిగ్గా అయిదేళ్ల క్రితం ఇదే రోజున అంటే.. 2019, ఆగస్ట్ 5వ తేదీన ఆర్టికల్ 370ని మోదీ ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే.
సార్వత్రిక ఎన్నికలతోపాటు స్పీకర్ ఎన్నిక సైతం పూర్తయింది. అనంతరం బీజేపీ అగ్రనాయకత్వం జమ్ము కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించింది. అందులోభాగంగా శుక్రవారం న్యూఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన ఆ పార్టీ కీలక నేతలు ‘ఈ అంశం’పై సమావేశమై చర్చించారు.
బుజ్జగింపు రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ కేరాఫ్‌గా నిలిచిందని ప్రధాని మోదీ(PM Modi) తీవ్ర విమర్శలు చేశారు. జమ్మూకశ్మీర్‌లోని ఉధంపూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రధాని మాట్లాడారు.
జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేసే ధైర్యం కాంగ్రెస్‌కు ఉందా అని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) ప్రశ్నించారు. మధ్యప్రదేశ్‌లో గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ.. ఆర్టికల్ 370ని మార్చడానికి ధైర్యం చేయవద్దని కాంగ్రెస్‌ను హెచ్చరించారు.
ప్రధాని నరేంద్ర మోదీ బిజీగా ఉన్నారు. వివిధ రాష్ట్రాల్లో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో క్షణం తీరకలేకుండా గడుపుతున్నారు. జమ్ముకశ్మీర్ రాష్ట్రంలో ప్రధాని మోదీ ఈ రోజు పర్యటిస్తారు. ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత ప్రధాని మోదీ తొలిసారి కశ్మీర్ వెళ్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. శ్రీనగర్‌లో రూ.6400 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు.
జమ్మూకశ్మీర్ కు స్వయం ప్రతిపత్రి కల్పించే 370వ అధికరణను కేంద్రం రద్దు చేయడాన్ని సుప్రీంకోర్టు సమర్ధిస్తూ ఇటీవల ఇచ్చిన చరిత్రాత్మక తీర్పుపై జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ నిశిత విమర్శ చేశారు. సుప్రీంకోర్టు నిర్ణయం దేవుడి తీర్పేమీ కాదని అన్నారు.